Breaking News

Monthly Archives: January 2025

శుక్రవారం జిఎంసిలో పట్టణ ప్రణాళిక ఓపెన్ ఫోరం… : కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళిక అంశాలపై అర్జీలు, ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి శుక్రవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి ఓపెన్ ఫోరం నిర్వహించబడునని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు, లైసెన్స్డ్ ఇంజినీర్లు, తమ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఫోరంను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Read More »

ట్రేడ్ లైసెన్స్ లపై ఇన్స్పెక్టర్లు సమగ్ర నివేదిక ఇవ్వాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో 10వ తేదీలోపు శానిటరీ డివిజన్ల వారీగా ట్రేడ్ లైసెన్స్ లపై ఇన్స్పెక్టర్లు సమగ్ర నివేదిక ఇవ్వాలని, 17 నుండి డి&ఓ ట్రేడ్ లైసెన్స్ లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సామవేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులతో ట్రేడ్ లైసెన్స్ లు, పారిశుధ్య పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ సచివాలయాల వారీగా డి&ఓ …

Read More »

అదానీతో ఒప్పందాల అంశాలపై సిఎం చంద్రబాబు

-అమెరికా నివేదికకై ఎదురుచూడడం విడ్డూరం -కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి గోదావరి`కృష్ణా`పెన్నా ప్రాజెక్టులా? -విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై స్పష్టమైన నిర్ణయం వెల్లడిరచాలి -ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటనలో నల్లజెండాలతో నిరసనలు -విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి: అదానీ కంపెనీలతో విద్యుత్‌ ఒప్పందాలపై జరిగిన అవినీతి వ్యవహారంపై అమెరికా ప్రభుత్వ తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుపట్టారు. …

Read More »

పుస్తక పఠనంతో కొత్త ఆలోచనలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పుస్తక పఠనం ప్రతి ఒక్కరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, ఆ అనుభూతుని ఆస్వాదించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. గురువారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మందిరంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి రెండు బీరువాలతో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పండుగలు, ముఖ్యమైన సందర్భాలలో తనను కలవడానికి వచ్చినప్పుడు పుష్పగుచ్చాలు, మొక్కలు, స్వీట్స్, శాలువలకు బదులుగా ఉపయోగపడే మంచి పుస్తకాలను కానుకగా అందించాలని, తద్వారా వాటిని అవసరమైన …

Read More »

పెడన కలంకారీ కి పూర్వవైభవం తీసుకువద్దాం….

-కలంకారీ క్లస్టర్ ఏర్పాటుతో పదివేల కుటుంబాలకు లబ్ధి…. -క్లస్టర్ ఏర్పాటుకు అనువైన స్థల పరిశీలన…… జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కలంకారి క్లస్టర్ ఏర్పాటుతో పెడన కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావటం తో పాటు, ఆ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీపట్నం రెవిన్యూ డివిజన్ పరిధిలోని పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు గురువారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవిన్యూ …

Read More »

కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు, పశుసంవర్ధక, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖాధికారులతో కోడి పందేల నిర్వహణ నిషేధంపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా కోడి పందేలు నిర్వహించకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం అధికారులతో కూడిన డివిజన్, మండల, …

Read More »

పంట రుణాలు మంజూరు చేసేందుకు గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు మంజూరు చేసేందుకు గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్లో మీకోసం మీటింగ్ హాల్లో జరిగింది. వార్షిక రుణ ప్రణాళిక అమలులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు వ్యవసాయతర రంగంలో వివిధ బ్యాంకులు మంజూరు చేసిన రుణాల లక్ష్యాలు సాధించిన ప్రగతి సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా …

Read More »

మరుగుదొడ్ల నిర్వహణ కచ్చితంగా జరగాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఉన్న మరుగుదొడ్లలన్నిటిలోనూ ఎటువంటి మరమ్మతులు లేకుండా చూడాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం తన పర్యటనలో భాగంగా పటమట, బందర్ రోడ్డు, వారధి, నేషనల్ హైవే, లబ్బీపేట వాటర్ ట్యాంక్, ఆర్టీసీ లేబర్ కాలనీ, నైజాం గేట్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్బీపేట లోని వాటర్ ట్యాంక్, గవర్నర్పేట వద్ద గల మరుగుదొడ్లను కమిషనర్ పరిశీలించి నగరపాలక సంస్థ సంబంధిత …

Read More »

దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర‌ స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. నూతన సంవత్సరం ప్రారంభం రోజున అమ్మవారి ఆలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ ఇన్చార్జి ఈవో రామచంద్ర మోహన్ తో పాటు ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలను …

Read More »

మనమంతా ఒక టీం..కలిసి పనిచేద్దాం… ప్రజల జీవితాలు మారుద్దాం!

-పేదల జీవన ప్రమాణాలు పెంచేలా సంస్కరణల అమలు -మార్పు తేవాలనే సంకల్పానికి నూతనత్వం, సాంకేతికత జోడిస్తే శాఖల్లో అద్బుత ఫలితాలు -సచివాలయంలో వివిధ శాఖల ముఖ్యకార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు -కొత్త సంవత్సరం సందర్భంగా అధికారులతో మాటామంతీ… పాజిటివ్ ఎనర్జీతో పనిచేద్దాం అని పిలుపు -తన ఆలోచనలు, ప్రాధాన్యతలు, లక్ష్యాలు వివరించిన సిఎం… అధికారుల అభిప్రాయల స్వీకరణ -కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో పనిచేద్దాం అంటూ అధికారులను ప్రోత్సహించిన సిఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా …

Read More »