Breaking News

Monthly Archives: January 2025

సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం…

-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని …

Read More »

ఈనెల ఆరో తేదీన 68వ జాతీయ స్కూల్ గేమ్స్ వాలీబాల్ టోర్నమెంట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల ఆరో తేదీ సోమవారం నుండి పదో తేదీ వరకు నగరంలోని సిద్ధార్థ జూనియర్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించే 68వ జాతీయ స్కూల్ గేమ్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్టేట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ, జనరల్ అబ్జర్వర్ జి. భానుమూర్తి రాజు తెలిపారు. నగరంలోని సిద్ధార్థ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ లో భాగంగా నిర్వహించే అండర్ 19 బాలికల వాలీబాల్ టోర్నమెంట్ కు …

Read More »

ఎమర్జెన్సీ వైద్య సేవల్లో ఆధునిక ఆవిష్కరణలు

– అత్యవసర సమయంలో ప్రతి క్షణం కీలకమే – సత్వర స్పందన.. ప్రభావవంతమైన చికిత్సలతో మెరుగైన ఫలితాలు – కామినేనిలో అంతర్జాతీయ స్థాయి అత్యవసర చికిత్సా విభాగం – ఎమర్జన్సీ చికిత్సల నిర్వహణపై అకడమిక్ సీఎంఈ ప్రోగ్రాంలో కామినేని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఆవిష్కరణల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన చికిత్సలు అందించే అవకాశం లభిస్తోందని కామినేని హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ అన్నారు. …

Read More »

సామాజిక సేవలో భాగస్వాములు కావాలి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కమ్మ వారందరూ సంఘటితమై సామాజిక సేవలో భాగస్వాములు కావాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఆదివారం గంగూరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ కమ్మ వారందరూ సమర్థత, సామర్థ్యం పెంచుకునే దిశగా ముందుకెళ్లాలన్నారు. తను ఏనాడు కులం చూడలేదని సమర్థత, సామర్థ్యంతో …

Read More »

ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపును ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తగా విడుదల కానున్న సినిమా టికెట్ల ధరలను పెంచుతూ, బెనిఫిట్ షోలకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో ఏపీలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ల ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600, మల్టీప్లెక్స్ టికెట్ …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …

Read More »

APMESA నూతన అధ్యక్షులుగా తిమ్మసర్తి నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం

-“మున్సిపల్ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా టీ.నాగేశ్వర రావు” -మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు నేటికీ కనీసం సర్వీస్ రూల్స్ కూడా లేకపోవడం తీవ్ర బాధాకరం… -ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కార్పొరేషన్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి….అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APMESA రాష్ట్ర అధ్యక్షులు దోప్పలపూడి ఈశ్వర్ తేదీ 31-12-2024 న ఉద్యోగ పదవీ విరమణ చేసినందున ఆదివారం జరిగిన APMESA రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కార్యవర్గ సభ్యులందరి ఎకాభిప్రాయంతొ, ఏకగ్రీవంగా చేసిన …

Read More »

ఇప్పటికీ ఏజెన్సీల దోపిడీకి గురౌతున్న వేలాదిమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులందర్నీ ఆప్కాస్ లోకి తీసుకోవాలి

-మెప్మా, సేర్ప్ ఉద్యోగులవలే, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి -11వ పిఆర్సి లో తీవ్రంగా నష్టపోయిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను తక్షణమే పెంచాలి. -సీనియార్టీ ప్రాతిపదికన వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలి -నూతన ప్రభుత్వం లో తమ కష్టాలు తీరుతాయన్న నమ్మకంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు. -కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ జేఏసీ రాష్ట్రస్థాయి జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలో ఏపీ జెఎసి అమరావతి నేతలు బొప్పరాజు, కే.సుమన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పని చేసే …

Read More »

కూటమి ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట

-ఎమ్మెల్యే సుజనా చౌదరి -ఎంపీ కేశినేని శివ నాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) అన్నారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట లోని కె బిఎన్ కళాశాల ఆవరణలో ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మెడికల్ క్యాంపు ను ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి …

Read More »

హంపి విజ‌యం తెలుగుజాతికి గ‌ర్వ‌కార‌ణం

-ప్ర‌పంచ చెస్ విజేత కోనేరు హంపికి శాప్ ఘ‌న‌స్వాగతం -వ‌ర‌ల్డ్ ర్యాపిడ్ చెస్ ఉమెన్ ఛాంపియ‌న్‌గా కోనేరు -హంపిని క‌లిసి అభినందించిన శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు -రాష్ట్ర క్రీడాభివృద్ధికి సూచ‌న‌లు, స‌ల‌హాలివ్వాల‌ని శాప్ ఛైర్మ‌న్ ఆకాంక్ష‌ -త్వ‌ర‌లోనే ఏపీ సీఎం చంద్ర‌బాబును క‌లుస్తాన‌న్న హంపి మంగ‌ళ‌గిరి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌పంచ మ‌హిళా చెస్ విజేత‌, తెలుగుతేజం శ్రీ కోనేరు హంపి గారిని మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం కొల‌నుకొండ‌లోని వారి నివాసంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు గారు శ‌నివారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా …

Read More »