Breaking News

ఇప్పటికీ ఏజెన్సీల దోపిడీకి గురౌతున్న వేలాదిమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులందర్నీ ఆప్కాస్ లోకి తీసుకోవాలి

-మెప్మా, సేర్ప్ ఉద్యోగులవలే, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి
-11వ పిఆర్సి లో తీవ్రంగా నష్టపోయిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను తక్షణమే పెంచాలి.
-సీనియార్టీ ప్రాతిపదికన వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలి
-నూతన ప్రభుత్వం లో తమ కష్టాలు తీరుతాయన్న నమ్మకంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు.
-కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ జేఏసీ రాష్ట్రస్థాయి జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలో ఏపీ జెఎసి అమరావతి నేతలు బొప్పరాజు, కే.సుమన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పని చేసే లక్షలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 11వ పీఆర్సీ లో తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే.సుమన్ లు తెలియజేశారు. ఆదివారం విజయవాడ లెనిన్ సెంటర్లో గల రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి అనుబంధంగా ఉన్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మరియు 26 జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే సుమన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బొప్పరాజు, మహిళా విభాగం ఛైర్పర్సన్ పారే లక్ష్మి, సెక్రెటరీ జనరల్ శ్రీమతి పొన్నూరు విజయలక్ష్మి, ఏపీ జేఏసీ అమరావతి క్యాపిటల్ యూనిట్ ప్రధాన కార్యదర్శి యం.శంకర్, గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వి. ఆర్లయ్యా తదితరులు ముఖ్య అతిథులుగా మరియు ఇతర రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… హెచ్ ఆర్ పాలసీ మెప్మా, సేర్ప్ లలో పనిచేస్తున్న ఉద్యోగులు వలె, అభద్రతా భావంతో, చాలీచాలని జీతాలతో, ప్రభుత్వాలు నిర్దేశించిన కార్యక్రమాలు అంకిత భావంతో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు.

జీతాల పెంపు
11వ పిఆర్సి కమిటీ మరియు అధికారులతో కూడిన సీఎస్ కమిటీ ఇద్దరు ఆమోదించి 30% వేతనాలు పెంచాలని సూచించగా అందుకు నిరాకరించిన ప్రభుత్వం కేవలం 23% మాత్రమే వేతనం పెంచగా ఏడు శాతం తగ్గించినందువలన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 2022 జనవరి నుండి ఇప్పటివరకు వేల రూపాయల నష్టపోవాల్సి వచ్చిందన్నారు. పి ఆర్ సి కమిటీ సూచించిన మేరకు వేతనం పెంచి ఉంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కొంతమేర లబ్దిపొంది ఉండేవారని, కనీసం ఈ ప్రభుత్వం అయినా వారి జీతాలు పెంచాలని కోరారు.

సీనియారిటీ ప్రాతిపదికన ఇంక్రిమెంట్లు;
ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో తక్కువ జీతానికి పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సీనియార్టీ ప్రాతిపదికన ప్రతి సంవత్సరం ఎంతోకొంత ఇంక్రిమెంట్ ఇస్తూ వేతన వ్యత్యాసాన్ని అమలు చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి అనేక దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కారం కాక, ఎక్కువ సమయం పని చేస్తూ, అతి తక్కువ వేతనాలు పొందుతున్న ఔట్ సోర్సింగ్ తీవ్రంగా నష్ట పోతున్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, నూతన ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వంపై ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆశ పెట్టుకుని ఉన్నారని, ప్రభుత్వం వీరి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *