Breaking News

Daily Archives: March 26, 2025

కలెక్టర్లు పోటీతత్వంతో పనిచేయాలి

-సృజనాత్మక ఆలోచనలు చేయండి -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రతి కలెక్టర్ ఇతరులతో పోటీ పడి పనిచేయాలని, సృజనాత్మకంగా ఆలోచించి పాలన సాగించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. జోన్-4లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు సమర్పించిన నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వచ్చే సమావేశం నాటికి కలెక్టర్ల పనితీరులో మార్పు రావాలని సూచించారు. వృద్ధి రేటు సాధించడంతోపాటు తలసరి ఆదాయం పెంచుకునేందుకు ఏం చేయాలనే …

Read More »

తెలుగు సాహిత్య ఔన్నత్యం మహెన్నతం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సాహిత్య ఔన్నత్యం మహోన్నతం అని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, తెలుగు భాషా ఉద్యమ సర్వ సైన్యాధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు, ఉ మ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ప్రముఖ రచయిత్రి కోనేరు కల్పన రచించిన “కంద పిలకలు” తెలుగు సంవత్సరాల శతకం ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా, శతక …

Read More »

జిల్లా ప్రగతి ప్రణాళికల సమీక్ష

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా 2 వ రోజు జోన్-4 లోని ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా ప్రగతి ప్రణాళికలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమీక్షిస్తూ….. నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ కి చెందిన 124 ఎకరాల భూమిని పారిశ్రామిక అభివృద్ధికై ఏపీఐఐసీ కేటాయించేలా చర్యలు చేపట్టాలి. చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.28 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది …

Read More »

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లాలో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయ‌డానికి 4 వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ సిద్ధంగా ఉంద‌ని ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆమె త‌మ జిల్లా ప్ర‌గ‌తి గురించి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. జిల్లాలో ప‌రిశ్ర‌మ‌లు, ఎంఎస్ఎంఈలు స్థాపించ‌డానికి ముందుకొచ్చే వారికోసం భూములు సిద్ధంగా ఉన్నాయ‌న్నారు. వ్య‌వ‌సాయ రంగంలో, ప‌ర్యాట‌క రంగంలో ఏలూరు …

Read More »

విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్

-ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు -రాష్ట్రస్థాయి ఇఫ్తార్ కు రూ. 75 లక్షల ఖర్చు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఇఫ్తార్ నిర్వహణకు ప్రణాళికాబద్ధమైన, పటిష్టమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.బుధవారం ఇఫ్తార్ వేదిక ఏ ప్లస్ కన్వెన్షన్ వద్ద మైనారిటీ సంక్షేమ శాఖ సీఈఓ శ్రీధర్ , ఎన్టీఆర్ కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులతో రాష్ట్రస్థాయి ఇఫ్తార్ కు సంబంధించి ఏర్పాట్ల విషయంపై …

Read More »

జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక : సీఎం చంద్రబాబు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జోన్-1 పరిధిలోని ఆరు జిల్లాలపై సీఎం సమీక్షించారు. కలెక్టర్ల నుంచి 2025-26 యాక్షన్ ప్లాన్ ను తీసుకున్న సీఎం.. జిల్లాస్థాయిలో పాలనపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా టూరిజం రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం కోరారు. తాను 30 ఏళ్లుగా పర్యాటకాభివృద్ధి కోసం మాట్లాడుతున్నానని, అప్పుడు తన మాటలను అర్థం చేసుకోని కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు టూరిజంపై తనతో …

Read More »

డోలీల ర‌హిత జిల్లాగా మార్చ‌డానికి ప్ర‌య‌త్నాలు

-కందుల సాగును ప్రోత్స‌హిస్తున్నాం -వెయ్యి ఎక‌రాల్లో నిమ్మ‌గ‌డ్డి సాగు -త‌ల‌స‌రి ఆదాయం పెంచే దిశ‌గా చ‌ర్య‌లు -పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా క‌లెక్ట‌ర్ శ్యామ్ ప్ర‌సాద్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాను డోలీల ర‌హిత జిల్లాగా మార్చ‌డానికి ప్రణాళికాబ‌ద్దంగా ప‌నిచేస్తున్నామ‌ని పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా క‌లెక్ట‌రు శ్యామ్ ప్ర‌సాద్ తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న త‌న జిల్లా ప్ర‌గ‌తిపైన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. జిల్లాలో గిరిజ‌నం ఎక్కువ‌గా ఉన్నార‌ని, కొండ ప్రాంతాల్లో ర‌హ‌దారి స‌దుపాయం లేకు డోలీలు …

Read More »

శ్రీకాకుళం జిల్లాలో కెమిక‌ల్ ఇంజినీర్లకు డిమాండు ఎక్కువ‌గా ఉంది

-ఫార్మా సంస్థ‌లకు ఈ నైపుణ్య వ‌న‌రుల కొర‌త ఉంది -జిల్లా త‌ల‌స‌రి ఆదాయం పెంపు దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం -ప్ర‌భుత్వ ఉద్యోగులంద‌రికీ ఏఐ టూల్స్‌పై శిక్ష‌ణ‌ -శ్రీకాకుళం జిల్లా క‌లెక్ట‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లాలో కెమిక‌ల్ ఇంజినీర్ల‌కు విప‌రీత‌మైన డిమాండు ఉంద‌ని శ్రీకాకుళం జిల్లా క‌లెక్ట‌రు స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ తెలిపారు. ఫార్మా రంగంలో జిల్లా వేగంగా అభివృద్ది చెందుతోంద‌ని చెప్పారు. జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న త‌న జిల్లా ప్ర‌గ‌తి గురించి ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. …

Read More »

ఐసీఎంఆర్ నిపుణుల‌తో తిరువూరు కిడ్నీ వ్యాధుల‌పై అధ్య‌య‌నం

-వ‌ర్షాకాలంలోపే బుడ‌మేరు గండ్లు పూడ్చి వేత‌ప‌నులు చేస్తాం -జిల్లాలో కొత్త‌గా 10 ఇసుక రీచ్‌ల‌ను గుర్తించాం -ఆటోన‌గ‌ర్‌లో ల‌క్ష మంది మెకానిక్‌ల అవ‌స‌ర‌ముంది -ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో కిడ్నీ వ్యాధులు ప్ర‌బ‌ల‌డానికి గ‌ల కార‌ణాల‌పై జోద్ పూర్‌లోని ఐసీఎంఆర్ నిపుణుల‌తో అధ్య‌యనం చేయించాల‌ని సంక‌ల్పించామ‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. ఇప్ప‌టికే ఈ ప్రాంతంలో జిల్లా స్థాయిలో నిపుణుల‌తో అధ్య‌య‌నం చేయించామ‌ని అయితే అక్క‌డ ఈ వ్యాధుల‌కు కార‌ణం నీటి …

Read More »

ఈ నెల 28లోగా ఫేజ్‌-2 వెబ్ ఆప్ష‌న్లు ఇవ్వాలి

-జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికార‌త అధికారి కె.శ్రీనివాస శిరోమ‌ణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత డీఎస్‌సీ కోచింగ్‌కు షార్ట్‌లిస్ట్ చేయ‌బ‌డిన ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థుల జాబితా https://mdfc.apcfss.in పోర్ట‌ల్‌లో ఉంద‌ని, జాబితాలోని అభ్య‌ర్థులు ఈ నెల 28వ తేదీలోగా ఫేజ్‌-2 వెబ్ ఆప్ష‌న్ స‌ర్వీస్ ద్వారా ఎంప్యానెల్డ్ కోచింగ్ సంస్థ‌ల‌కు త‌మ ప్రాధాన్య‌తలు ఇవ్వాల‌ని జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికార‌త అధికారి కె. శ్రీనివాస శిరోమణి బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో సూచించారు. వెబ్ ఆప్ష‌న్ల ప్ర‌క్రియ ద్వారా అభ్య‌ర్థులు అన్ని కోచింగ్ …

Read More »