-రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఏయూ దిక్సూచి -యువత జాబ్ సీకర్స్ కాదు… జాబ్ క్రియేటర్స్ అవ్వాలి -గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖకు కొత్త చరిత్ర -ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు -ఏయూ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించిన సీఎం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యూనివర్సిటీలు డిగ్రీలు ఇచ్చే విద్యా కేంద్రాలు మాత్రమే కాదని… సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు వేదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యూనివర్సిటీలు జాతీయ ఆస్తులని, వాటిని కాపాడుకోవాలని అన్నారు. విశాఖలో జరిగిన …
Read More »Monthly Archives: April 2026
శేషాచలం అడవుల్లో అగ్నిప్రమాదంపై పవన్ కళ్యాణ్ ఆరా
-మంటలు విస్తరించకుండా తక్షణం అదుపు చేసే చర్యలు చేపట్టండి -బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం -ఘటనపై పీసీసీఎఫ్ వివరణ కోరిన ఉపముఖ్యమంత్రివర్యులు -ప్రజల భాగస్వామ్యంతో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పట్టణానికి సమీపంలోని శేషాచలం అడవుల్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం కారణంగా అటవీ సంపదకు భారీ స్థాయిలో నష్టం జరగడం దురదృష్టకరమన్నారు. వేసవి తీవ్రత …
Read More »కోతలు లేకుండా వేసవిలో నిరంతరాయ విద్యుత్ సరఫరా
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా ఉత్పత్తి పెంచేలా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మూడు డిస్కంల సీఎండీలు పృథ్వితేజ, శివశంకర్, పుల్లారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ లు హాజరయ్యారు. సమీక్ష …
Read More »భారత్ ఏఐలో విశాఖ గూగుల్ క్లౌడ్ ఇండియా స్వర్ణయుగం
– మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో ఏర్పాటు చేసే గూగుల్ ఏఐ డేటా సెంటర్ భారతదేశ డిజిటల్ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవబోతోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ శంకుస్థాపన చేస్తోన్న నేపథ్యంలో మంత్రి కొండపల్లి దీనిని …
Read More »ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కోరారు. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైనట్లు పేర్కొన్నారు. మొత్తం 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. మంగళవారం (28-04-26) అధిక ఉష్ణోగ్రతలతో పాటు 19 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 21 మండలాల్లో …
Read More »పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదు
-రవాణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలి…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రవాణా సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని …
Read More »రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నాడు…
-జనసేన కార్యకర్త వై.వెంకటపతి రాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపు కోసం కృషిచేసిన తనపై అదే నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కుట్రపూరితంగా తనపై దాడులు చేస్తున్నారని బాధితుడు వై. వెంకటపతి రాజు ఆరోపణలు చేశారు. తనపై కేసులు పెట్టి తనను తన తోటి వారిని హింసిస్తున్నారని, దీనికి పోలీస్ వ్యవస్థ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై భౌతిక దాడులకు సైతం పాల్పడేందుకు ఎమ్మెల్యే వెనుక ఉండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. …
Read More »ఇంధన సంక్షోభంపై కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ఇంధన సంక్షోభంపై తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 70% పెట్రోల్ బంకులు మూతపడటం, నిల్వలు లేకపోవడం వల్ల ప్రజలు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఎక్కడా ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొనడం సరఫరా నిర్వహణపై అనుమానాలు కలిగిస్తున్నాయని ఎంపీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు …
Read More »రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఇంధన కొరతకు కారణం : ఎంపీ గురుమూర్తి
-రాష్ట్రంలో కృత్రిమ ఇంధన కొరతపై తిరుపతి ఆగ్రహం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి విమర్శించారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఎంపీ స్వయంగా తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారు. బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొనడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడా ఇంధన కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అందచేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 48వ డివిజన్ కు చెందిన పల్లె సుధా లక్ష్మీ గర్భాశయ వ్యాధి తో బాధ పడుతోంది. మెరుగైన వైద్యం కోసం 1,80,000/- రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేక పోవడంతో ఆమె ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించింది. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆమెకు ఆర్థిక సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు లేఖ రాసారు. దీనికి సంబంధించిన ఎల్వోసీ నీ సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో రోగి బంధువులకు అంద చేశారు. …
Read More »
Prajavartha Online Telugu News