Breaking News

Monthly Archives: April 2026

ఇంటి నుంచే వివ‌రాలు న‌మోదు చేయండి

– స్వీయ గ‌ణ‌న ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాములుకండి – అందుబాటులో https://se.census.gov.in పోర్ట‌ల్ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో మొట్ట‌మొద‌టి డిజిట‌ల్ జ‌న గ‌ణ‌న తొలిద‌శ‌లో భాగంగా ప్రారంభ‌మైన స్వీయ గ‌ణ‌న (సెల్ఫ్ ఎన్యూమ‌రేష‌న్ – ఎస్ఈ)లో ప్ర‌జ‌లు ఉత్సాహంగా పాల్గొని త‌మ ఇంటి నుంచే స‌మాచారాన్ని న‌మోదు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ కోరారు. ఈ నెల 16 నుంచి స్వీయ గ‌ణ‌న జ‌రుగుతున్న నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ బుధ‌వారం ఎ.కొండూరులోని చైత‌న్య‌న‌గ‌ర్ …

Read More »

మార్గ‌ద‌ర్శుల‌కు అన్న‌దాత‌లయ్యే అవ‌కాశం

– శుభ కార్యాల సంద‌ర్భంగా మంచి మ‌న‌సును చాటుకోండి – ప‌ట్టెడ‌న్నం పెట్టి పేద‌ల ఆక‌లి తీర్చ‌డంలో భాగ‌స్వాములుకండి – అన్నా క్యాంటీన్ల‌కు విరాళాల‌తో చేయూత‌నివ్వండి – ముఖ్య‌మంత్రి దంప‌తుల స్ఫూర్తితో ముందుకురండి – ఒక అన్నా క్యాంటీన్ లో రోజుక‌య్యే ఖ‌ర్చు రూ. 29,800 – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నార్తుల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టి ఆక‌లి తీర్చ‌డంలో మార్గ‌ద‌ర్శుల‌కు గొప్ప అవ‌కాశం అందిస్తున్నామ‌ని.. ప్ర‌తిఒక్క‌రూ వారి ఇళ్ల‌లో జ‌రిగే శుభ‌కార్యాలు సంద‌ర్భంగా అన్నా క్యాంటీన్‌కు …

Read More »

కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించే బాధ్యత ప్రతి ఒక్కరిదని విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఉదయం కలరో హాస్పిటల్, చిట్టినగర్, మరియు గాంధీ హిల్ వన్ టౌన్ లో వర్డ్ ఎర్త్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వారి బాధ్యతగా నిర్వహించాలని, ఆరోగ్యకరమైన శ్వాస పేల్చేందుకు ఆక్సిజన్ …

Read More »

అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల విజేత చైత్రదీపిక కు మునిసిపల్ కమీషనర్ ధ్యానచంద్ర అభినందనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టిక్ పోటీల్లో ఎన్నో పతకాలను సాధించిన చైత్రదీపిక ను విజయవాడ మునిసిపల్ కమీషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో అభినందించారు. తైవాన్‌లో ఈ నెల ఏప్రిల్ 11 నుండి 19వ తేదీ వరకు జరిగిన ‘2026 తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ కాంపిటీషన్స్’లో చైత్రదీపిక భారతదేశం తరఫున పాల్గొని, మెరుగైన ప్రతిభను చూపి యూత్ కేటగిరి లో ఇన్ లైన్ ఈవెంట్ లో రజత పతకం, …

Read More »

జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం సజావుగా చేపట్టాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం సజావుగా చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర రావు ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు సూచించారు. జనాభా లెక్కల సేకరణ 2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎక్కడికక్కడ ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా మచిలీపట్నం మండలంలో జనాభా లెక్కలలు సేకరించే ఎన్యూమేరేటర్లకు, సూపర్వైజర్లకు మొదటి దశ రెండవ రోజు శిక్షణా తరగతులు మచిలీపట్నంలోని వై జె ఆర్ డి ఎం ఎస్ ఇంజనీరింగ్ కళాశాల …

Read More »

పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలు స్వచ్ఛ సైనికులుగా తయారై పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నగరంలోని 44 వ డివిజన్ గాది రెడ్డి గారి వీధి లో డాక్టర్ మల్లికార్జున రావు ఆసుపత్రి సమీపంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ స్వయంగా పట్టకారు లాంటి స్వచ్ఛ ఆయుధాన్ని చేత పట్టుకొని మునిసిపల్ కమిషనర్, సహాయ …

Read More »

గుంటూరు నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక… : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని సుస్థిర, ఆధునిక మరియు ప్రజలకు అనుకూలమైన నగరంగా రూపుదిద్దే దిశగా ఒక కీలక ముందడుగు వేస్తున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో శ్రీవత్స కన్సల్టెంట్స్ సిఈఓ మరియు ఉదార్ ఫౌండేషన్ ఛైర్మన్ కిరణ్ భమిడిపాటి కలిసి గుంటూరు నగరం అర్బన్ రిజువనేషన్ మాస్టర్ ప్లాన్ పై విపులంగా మ్యాప్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో …

Read More »

నగర ప్రజలకు వేసవి ఉపశమనం – 50 చలివేంద్రాల ఏర్పాటు… : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు నగరపాలక సంస్థ పటిష్టమైన చర్యలు చేపట్టిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి బాటసారులకు, కార్మికులకు మరియు ప్రయాణికులకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా నగరవ్యాప్తంగా మొత్తం 50 చలివేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయగా, సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన వివిధ స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు …

Read More »

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీలు అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ 48 వ డివిజన్ కు చెందిన యంగల భువనేశ్వరి కి. అన్ని అవయవాలు పని చేయక పోవడంతో వెంటిలేటర్ తో చికిత్స చేయాల్సి వచ్చింది . ఆమెకు వైద్యం కోసం 4,00,000/- రూపాయలు అవుతుందని వైద్యులు తెలిపారు. అదే విధంగా 56 వ డివిజన్ కు చెందిన మొగల్ అజీజ్ బేగ్. హెర్నియా సమస్యతో బాధ పడుతున్నాడు. ఆయనకు వైద్యాంకోసం 2,03,000/- రూపాయలు అంటుందని వైద్యులు తెలిపారు. వీరిరువురూ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (AP SCERT)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముంబైలోని రాంభావ్ మహాల్గి ప్రభోధిని, భయందర్ వేదికగా 22 ఏప్రిల్ 2026న నిర్వహించిన జాతీయ స్థాయి వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ (WPC) పోటీలలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబర్చారు. ఈ పోటీలను LeapForWord సంస్థ ఆధ్వర్యంలో 2వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించారు. దేశంలోని 9 రాష్ట్రాల నుండి విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల ప్రదర్శన వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 4వ తరగతి: గెడ్డం …

Read More »