పీఎం సూర్యఘర్ పథకంపై సూర్యాంధ్ర ప్రగతి రథాల ద్వారా విస్రృతి ప్రచారం పీఎం సూర్య ఘర్ యూఎల్ఏ (Utility Led Aggrigation) మోడ్ ప్రచారం ప్రారంభం మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూర్యాంధ్ర ప్రగతి రథాల ద్వారా ప్రజల్లో సౌరశక్తి వినియోగంపై అవగాహన పెంపొందిస్తూ ప్రతి ఇంట్లో సూర్యఘర్ వెలుగులు నింపేందుకు పీఎం సూర్యఘర్ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ …
Read More »Monthly Archives: April 2026
హస్తకళకు విలువ… జీవితానికి వెలుగు
-సృజనాత్మకతే మహిళల సుస్థిర ఉపాధికి బాట -ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :హస్తకళా రంగం మహిళల ఆర్థిక స్వావలంబనకు బలమైన ఆధారంగా నిలుస్తోందని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. సంప్రదాయ నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని రూపొందించే హస్తకళా ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు.శనివారం విజయవాడ రూరల్, గొల్లపూడి డీఆర్‌డీఏ కార్యాలయంలో రైజ్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు హస్తకళా ఉత్పత్తులపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ …
Read More »లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి
–వేగం మరింత పెరగాలి… ఐకానిక్ ముద్ర కనిపించాలి –నిర్మాణ సంస్థలు కడుతోంది కేవలం బిల్డింగులు కాదు… రాజధాని –రాజధాని పనులకు గ్రీన్ ఛానెల్ ద్వారా ఇసుక, గ్రావెల్ –ప్రభుత్వ శాఖలు, అధికారులు సమన్వయంతో జాప్యం లేకుండా చూడాలి -అమరావతి రాజధాని పనులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు –రాజధానిలో అగ్నిప్రమాదాలపై సీఎం అసంతృప్తి… నిర్మాణ సంస్థలదే బాధ్యతని స్పష్టం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. …
Read More »మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార యత్నం నిందితులపై చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాచర్ల పట్టణంలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై ఆగంతకుడు అత్యాచార యత్నం చేసిన ఘటనలో త్వరితగతిన నిందితుణ్ని అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. పంచాయితీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఒక అగంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్టు …
Read More »ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌లో మత్తు లేకుండా మెలకువలోనే క్యాన్సర్ రోగికి గుండె బైపాస్ శస్త్రచికిత్స
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, గుంటూరులో గుండె శస్త్ర చికిత్సా వైద్య బృందం ఒక విశిష్టమైన వైద్య విజయాన్ని నమోదు చేసింది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 64 ఏళ్ల రోగికి మెలకువలోనే (అవేక్) కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (బైపాస్) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆధునిక గుండె వైద్యంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. ఈ రోగి డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో పాటు మూడు గుండె రక్తనాళాల్లో తీవ్రమైన పూడికలతో బాధపడుతూ, గతంలో కుడి ఊపిరితిత్తి క్యాన్సర్‌కు చికిత్స …
Read More »స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాల ప్రణాళిక
–మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణ కవచం, పితృ భాగస్వామ్యం, పనిచోట్ల సంరక్షణ కేంద్రాలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు –శ్రమ శక్తిలో మహిళల ఇతోధిక భాగస్వామ్యంతో సాధికారత –సామాజిక, ఆర్థిక సమానత్వంతో జనాభా స్థిరీకరణలో మహిళలకు పెద్దపీట –వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పలు సామాజిక, ఆర్థిక పరిమితులతో వివక్షకు గురవుతున్న మహిళలకు సాధికారిత(ఎంపవర్మెంట్) ద్వారా రాష్ట్ర ప్రగతిలో వారికి భాగస్వామ్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికను రూపొందించింది. సుదీర్ఘ కాలంపాటు రాష్ట్ర …
Read More »హస్తకళకు విలువ… జీవితానికి వెలుగు
– సృజనాత్మకతే మహిళల సుస్థిర ఉపాధికి బాట –ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హస్తకళా రంగం మహిళల ఆర్థిక స్వావలంబనకు బలమైన ఆధారంగా నిలుస్తోందని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. సంప్రదాయ నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని రూపొందించే హస్తకళా ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు.శనివారం విజయవాడ రూరల్, గొల్లపూడి డీఆర్‌డీఏ కార్యాలయంలో రైజ్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు హస్తకళా ఉత్పత్తులపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ …
Read More »నందిగామలో త్వరలోనే కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవనాలు
-ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :నందిగామలో కేంద్రీయ విద్యాలయం కు శాశ్వత భవనాల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా చేపడతామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని ) తెలిపారు. నందిగామలో కేంద్రీయ విద్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న భవనాలను, శాశ్వత భవనాలు నిర్మాణం చేయనున్న రాఘవాపురంలోని ప్రాంతాన్ని స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య తో కలిసి శనివారం ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా తాత్కాలిక భవనాల ను పరిశీలించిన ఎంపీ …
Read More »భవిష్యత్ ఏఐ అవకాశాలను మన యువత అందిపుచ్చుకోవాలి
-పాతికేళ్ల క్రితం ఐటీ విప్లవంతో తెలుగువారు ప్రపంచమంతా విస్తరించారు-గత ఐదు సంవత్సరాల విధ్వంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది-కూటమి వచ్చాక ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది-విజయవాడలో నిర్వహించిన ఏఐ ఫ్యూజన్ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిన్నటి వరకు ప్రపంచాన్ని ఐటీ రంగం శాసిస్తే.. నేడు ఏఐ యుగం మొదలైంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు …
Read More »అత్యంత నాణ్యంగా మధ్యాహ్న భోజనం
-ప్రతి విద్యార్ధికి సరైన పోషకాహారం అందించేలా ఏర్పాట్లు -సన్నబియ్యం, ఆకుకూరలతో ప్రత్యేక భోజనం -155 కేంద్రాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నాణ్యమైన ఆహారం – పెనమలూరు జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :ప్రభుత్వ స్కూళ్లలో చదివే ప్రతి పిల్లవానికి నాణ్యమైన భోజనం అందించే లక్ష్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు పెనమలూరు …
Read More »
Prajavartha Online Telugu News