విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవాడ ఆజాద్ చంద్రశేఖర్, ఐపీఎస్ శనివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సందర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు మరియు అర్చకులు ఘన స్వాగతం పలికారు.అమ్మవారి అంతరాలయంలో డీజీపీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా కేరళ డీజీపీ మాట్లాడుతూ.. …
Read More »Monthly Archives: April 2026
మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూత
-స్వయం ఉపాధికి సరికొత్త మార్కెటింగ్-మహిళా పారిశ్రామికవేత్తలకు షాపింగ్ మాల్స్ భరోసా-సామాజిక బాధ్యతగా తొలి అడుగు వేసిన ఎల్ఈపీఎల్-ఎన్‌టీఆర్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడానికి, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న మహిళలకు మార్కెటింగ్ రంగంలో కొత్త అవకాశాలు కల్పించే దిశగా ఎన్‌టీఆర్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ చొరవతో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికంగా తయారు చేస్తున్న హస్తకళా ఉత్పత్తులు, ఇతర …
Read More »Dr. Tarun Kakani Emerges as a Key Voice in Amaravati Movement; Reaffirms Vision for a Progressive Andhra Pradesh
Amaravati, Neti Patrika Prajavartha : Dr. Tarun Kakani, a dynamic entrepreneur-turned-public figure, has emerged as a committed advocate for Amaravati and its stakeholders, drawing inspiration from his political idol Kakani Venkataratnam, revered for his leadership during the Jai Andhra Movement. During the 2019 Amaravati capital movement, Dr. Tarun stood shoulder-to-shoulder with farmers and women, actively supporting their cause at a …
Read More »మనందరి పోరాట ఫలితమే ‘అమరావతి శాసనం’
–విద్యార్థి యువజన జేఏసీ నాయకుడు మద్దుకూరి రామబ్రహ్మం -ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన జేఏసీ నాయకులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రుల ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం చారిత్రాత్మక ఘట్టమని అమరావతి విద్యార్థి యువజన జేఏసీ నాయకుడు మద్దుకూరి రామబ్రహ్మం కొనియాడారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జేఏసీ ప్రతినిధులు కలిసి, అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా రామబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. …
Read More »రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్ లోక్సభలో ఆమోదం పొందినందుకు- కార్పొరేషన్ లో వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్ లోక్సభలో ఆమోదం పొందినందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కు చట్టబద్ధత బిల్ లోక్సభ ఆమోదం పలికినందుకు ఈ వేడుకలు జరుపుకుంటున్నామని, నగరంలోని జోనల్ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, వసతి గృహాలులో కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి చంద్రశేఖర్, ఏ రవీంద్రరావు, …
Read More »తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి హామీలు అమలు జరిగాయో రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలకు వివరించాలి…
సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కేరళ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలో చేసిన ఆరు వాగ్దానాలను సక్రమంగా అమలు చేసామని, అవసరమైతే కేరళ రాష్ట్ర మంత్రివర్గం వచ్చి వాటిని పరిశీలించవచ్చని తెలిపారు. కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం సాధించిన విజయాలను తగ్గిస్తూ, కించపరచే విధంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఏమి సాధించిందో ఇక్కడ ఉన్న సిపిఐ, సిపిఎం నాయకులకు …
Read More »చల్లపల్లి పోలీస్ స్టేషన్ పేలుడు ఘటన దురదృష్టకరం క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
మంగళగిరి/చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యలు వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మంగళగిరిలోని ఎన్.ఆర్.ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు పోలీసు సిబ్బందిని మంత్రి ఈరోజు స్వయంగా పరామర్శించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను …
Read More »సూక్ష్మ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ
-రాష్ట్రంలో 1.26 లక్షల హెక్టార్ల పరిధిలో సూక్ష్మ సేద్యం -రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినందుకు అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ (APMIP) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించి, రికార్డు స్థాయిలో 1,26,057 హెక్టార్లను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకువచ్చిన అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ తర్వాత …
Read More »డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా ఆశీస్సులతోఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ అనిల్ కుమార్ సౌజన్యంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎండ తీవ్రతకి ఇబ్బంది పాదచారులకి మా వంతుగా డొక్కా సీతమ్మ కమిటీ మెంబర్స్ అందరం ఎప్పుడు పేదలకు సేవ చేయడానికి ముందుకు వస్తాం ప్రజలకు ఎప్పుడూ ఏమీ అవసరమో వాటిని మా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆలోచించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం ఆకలితో ఉన్నవారికి,దప్పికతో ఉన్నవారికి మా …
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ తక్షణ కర్తవ్యం
-మచిలీపట్నంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నాశనం చేశారు. వారి పాపాల ఫలితంగానే నేడు రెవెన్యూ సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలన్నింటిని కూడా పరిష్కరించాలి. ఇదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. నియోజకవర్గంలో ఇప్పటివరకు 335 ఫిర్యాదులు వచ్చాయి. …
Read More »
Prajavartha Online Telugu News