– అధికారులు తీరు మార్చుకోవాలన్న మంత్రి నిమ్మల.-ఆదివారంలోగా అంచనాలు సమర్పించాలని ఆదేశం.-సిఈలతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా కాకుండా, ఇరిగేషన్ అధికారులు తీరు మార్చు కోవాలని హెచ్చరించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి నిమ్మల నియోజకవర్గాల వారీగా కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత, వంటి పనులకు సంబందించిన అంచనాల తయారీపై సమీక్ష నిర్వహించారు. ఆయా …
Read More »Monthly Archives: April 2026
దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి
-వైసీపీ నాశనం చేస్తే -మేం శాసనం చేశాం -దేశమంతా మద్దతిస్తే వైసీపీ ఒక్కటే వ్యతిరేకించింది -పార్లమెంటులో చేసిన చట్టాన్నీ గౌరవించరా? -వైసీపీకి రాష్ట్ర ప్రజలు, వారి ప్రయోజనాలంటే లెక్కలేదు -ఇక అమరావతిని ఎవరూ మార్చలేరు,కదల్చలేరు -మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక్క వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి అండగా నిలిచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని రాజకీయ పార్టీలూ, ఎంపీలు అమరావతి చట్టబద్దత కల్పించే బిల్లుపై …
Read More »అపదలో ప్రాణదాతగా 108 సేవలు
– గత 3 నెలల్లో 9,183 మంది గుండెపోటు బాధితులకు పునర్జన్మ– కాలంతో పోటీపడి ప్రాణాలు కాపాడుతున్న 108 అత్యవసర సేవలుఅమరావతి,నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భవ్య హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 108 అత్యవసర సేవలు అత్యంత వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన గుండెపోటు (Cardiac Emergencies) కేసుల్లో సమయానుకూలంగా స్పందించి, గత మూడు నెలల కాలంలోనే 9,183 మంది బాధితులను మృత్యువు అంచున నుంచి కాపాడటం ఒక విశేష విజయంగా నిలిచిందని 108 …
Read More »శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన : ముఖ్యమంత్రి చంద్రబాబు
–ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవం –పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు ఒంటిమిట్ట, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరాముని ఆశీస్సులతో ధర్మాన్ని అనుసరించి ధర్మపాలన అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాముడు పేరు వినగానే గుర్తొచ్చేది రామరాజ్యం.. సుపరిపాలన అని వ్యాఖ్యానించారు. ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామి వారికి సతీసమేతంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రికి ఆలయ పండితులు స్వామి వార్ల చిత్రపటాన్ని అందించి ప్రసాదాలను అందించారు. అనంతరం జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని …
Read More »టి.డి. జనార్ధన్ కి 69వ జన్మదినం శుభాకాంక్షలు… : మోటూరి శంకర్‌రావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :తెలుగుదేశం పార్టీ సీనియర్ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు మరియు పొలిటికల్ సెక్రెటరీ టి.డి. జనార్ధన్ కి ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నగరంలోని తమ కార్యాలయంలో మోటూరి శంకర్‌రావు మాట్లాడుతూ టి.డి. జనార్ధన్ పార్టీలో సీనియర్ నాయకులని, దశాబ్దాలుగా పార్టీకి మరియు ప్రభుత్వానికి సేవలు అందించడమే కాకుండా, మాజీ సైనికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని సుమారు 2,50,000 పైచిలుకు మాజీ సైనికులు, …
Read More »
Prajavartha Online Telugu News