Breaking News

Monthly Archives: April 2026

జర్నలిస్టులపై అప్రకటిత సెన్సార్‌షిప్

-కేంద్రం తీరుపై ఐజేయూ తీవ్ర ఆగ్రహం! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :  జర్నలిస్టులు, స్వతంత్ర డిజిటల్ మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికల పట్ల ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరుపై ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాలను విమర్శించే జర్నలిస్టులు, వ్యంగ్య రచయితలు, స్టాండప్ కమేడియన్లు, ఫ్యాక్ట్ చెకర్ల కంటెంట్‌ను, వీడియోలను ఏకపక్షంగా తొలగించడం, బ్లాక్ చేయడాన్ని “అప్రకటిత సెన్సార్‌షిప”గా ఐజేయూ అభివర్ణించింది.ఈ మేరకు ఐజేయూ అధ్యక్షుడు బల్విందర్ సింగ్ జమ్ము, సెక్రటరీ జనరల్ డి.సోమసుందర్ శుక్రవారం …

Read More »

కేంద్ర రోడ్లు, రవాణా & హైవే శాఖ (MoRTH) సెక్రటరీతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భేటీ

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :  కేంద్రంలోని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం – రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సమన్వయంతో ఏపీలో NH ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఆర్ & బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల మంజూరు, విస్తరణ పనుల అమలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్ర రోడ్లు, రవాణా & హైవే శాఖ సెక్రెటరీ ఉమాశంకర్ ను కలిసి మంత్రి బీసీ జనార్దన్ …

Read More »

‘పవిత్ర కృష్ణానదిలో ఆది దంపతుల నదీ విహారం’

ఇంద్రకీలాద్రి,03 ఏప్రిల్ 2026 చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు -2026 పురస్కరించుకొని తేది. 03.04.2026 సాయంత్రం 5 గంటలకు -ఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయం నుండి దేవ దేవీరిలకు పవిత్ర కృష్ణానదిలో- నదీ విహారం నిర్వహించుటకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లే ఉత్సవము ప్రారంభ మైనది. వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాలు నడుమ స్వామి, అమ్మ వార్లకు నదీ విహారము నిర్వహించటకు మల్లేశ్వర స్వామి ఆలయం నుండి బయలుదేరిన బృందం మహామండపం వద్దనుండి కూచిపూడి నృత్య కళాకారులు, సంప్రదాయ తప్పెట్లు, కోలాటం, భజన సంకీర్తన …

Read More »

పక్కా ప్రణాళికలు ఉండాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : లక్ష్య సాధనకు పక్కా ప్రణాళికలు ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో ఆయా శాఖల ప్రగతిపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీకలవాగు, కొండవీటివాగు వంటి వరద ప్రభావిత వాగులపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని ఆదేశించారు.ఎం.ఎస్.ఎం.ఇ పార్కులను ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ మోడల్ లో  ఏర్పాటుకు నియోజక వర్గాల్లో రెండు ఎకరాల స్థలం గుర్తించాలన్నారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగు నీరు అందించుటకు …

Read More »

“త్యాగం, ప్రేమ, క్షమ కలిగి ఉండాలి ఇదే గుడ్ ఫ్రైడే సందేశం.”

-టీడీపీ నాయకులు గద్దె క్రాంతి కుమార్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్ ఫ్రైడే అనేది మానవాళి కోసం యేసు క్రీస్తు చేసిన త్యాగాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజు అని, ప్రపంచానికి ప్రేమ, క్షమ, త్యాగం అనే గొప్ప విలువలను యేసు క్రీస్తు తన జీవితం ద్వారా నేర్పించారని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 5వ డివిజన్ క్రీస్తురాజపురంలోని IPC చర్చిలో ఫాస్టర్ సొంగ అబ్రహం నెత్రుత్వంలో జరిగిన గుడ్ ఫ్రైడే ప్రార్థన కార్యక్రమంలో టిడిపి నాయకులు గద్దె క్రాంతి కుమార్ పాల్గొని, క్రైస్తవ …

Read More »

  ప్రత్యేక శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :  జిల్లాలో 9వ తరగతి నుండి 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థుల పట్ల ఇప్పటినుండే ప్రత్యేక శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రత్యేక అధికారులతో విద్యార్థులకు చదువు నేర్పే విషయమై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తాను ఇదివరకు …

Read More »

స్వచ్ఛాయుధం’ – ‘స్వచ్ఛ యోధులు’తో ప్లాస్టిక్ రహిత నగర నిర్మాణానికి శ్రీకారం –– జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :  మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా, శుభ్రంగా, పచ్చదనంతో నింపిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ శుక్రవారం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని రహదారులు భవనాలు శాఖ అతిథి గృహం సమీపంలోని ఎన్జీఓస్ కాలనీలో జరిగిన …

Read More »

అభ్యసనా స్థాయిలకు అనుగుణంగా లేని ప్రశ్నలకు విద్యార్థులకు అదనపు మార్కులు ఇవ్వాలి -ఎస్ టి యు డిమాండ్

అమరావతి,నేటి పత్రిక ప్రజావార్త :  పదవ తరగతి మూల్యాంకనం 6 నుంచి ప్రారంభమవుతున్న దృష్ట్యా ఆంగ్ల ప్రశ్నాపత్రము మరియు భౌతిక శాస్త్ర ప్రశ్నాపత్రాలలో అభ్యసనా స్థాయిలకు అనుగుణంగా లేని ప్రశ్నలకు విద్యార్థులకు నష్టం జరగకుండా అదనపు మార్కులు ఇవ్వాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక పేరుతో రోజువారి నిర్దేశిత సిలబస్ బోధించమని విద్యాశాఖ ఆదేశించిందని, ప్రస్తుత ప్రశ్నాపత్రాలను పరిశీలించిన పిదప ఏం సమాధానం చెబుతారని రాష్ట్రోపాధ్యాయ సంఘం …

Read More »

రంగా అభిమానుల సంక్షేమమే లక్ష్యం

-తెలుగు రాష్ట్రాల రంగా అభిమానుల చర్చించిన తర్వాతే రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం -అన్నయ్యకు నాకు ఎలాంటి విభేదాలు లేవు, అన్నయ్య ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉన్నాయి -కొండపల్లి వంగవీటి కుటుంబానికి పుట్టినిల్లు లాంటిది -కొండపల్లికి ఆహ్వానించిన అల్తాఫ్ బాబాకు ధన్యవాదాలు -వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్ -శ్రీ శిరిడి సాయిబాబా మందిరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఆశా కిరణ్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :  పేద ప్రజల ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగ అభిమానుల సంక్షేమమే లక్ష్యం …

Read More »

వడగాలులు వీచే అవకాశం…

అమరావతి,నేటి పత్రిక ప్రజావార్త : శనివారం 73 మండలాల్లో తీవ్రవడగాలులు, 17 మండలాల్లో వడగాలులు, ఆదివారం 32 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శనివారం (04-04-26) శ్రీకాకుళం జిల్లాలో 16, విజయనగరం 24, పార్వతీపురంమన్యం 15, అల్లూరి 3, పోలవరం 9, అనకాపల్లి 2, కాకినాడ 3, తూర్పుగోదావరి 1 మండలాల్లో తీవ్రవడగాలులు(73) వీచే అవకాశం …

Read More »