పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలం, గండిగుంట మూర్తిరాజుగూడెం ప్రాంతంలో ‘జలధార – నీటి భద్రత’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పంటకాలువల పూడికతీత పనులను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో కలిసి ప్రారంభించిన మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంపొందిస్తూ రైతులకు సమృద్ధిగా నీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »Monthly Archives: April 2026
వ్యవసాయానికి బలం, రైతులకు భరోసా – KDCCతో కొత్త అధ్యాయం
-KDCC బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన భవనాన్ని KDCC బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం సహకార సంఘం అధ్యక్షులు వాసు కునపరెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా KDCC బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ, సహకార రంగం రైతులకు నిజమైన ఆర్థిక భరోసా కల్పించే బలమైన వేదికగా మారిందని తెలిపారు. ఉమ్మడి …
Read More »తిరుపతిలో బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :దేశ మాజీ ఉపప్రధాని, మహానేత బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా తిరుపతి నగరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కార్యక్రమంలో …
Read More »“నృత్య, నాట్య హేళ” సాంస్కృతిక వేడుకలు ఘనంగా నిర్వహణ
తిరుపతి, నేటి పత్రిక విజయవాడ :భారతీయ సాంప్రదాయ కళలకు ప్రాధాన్యతనిస్తూ “భారతకళాక్షేత్రం” ఆధ్వర్యంలో నిర్వహించిన “నృత్య, నాట్య హేళ” సాంస్కృతిక కార్యక్రమం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు.ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ నృత్య కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఈ కళల ద్వారా మన భారతీయత …
Read More »కపిలేశ్వరపురం జెడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కామినేని హాస్పిటల్స్ సేవలు ప్రశంసనీయం
-రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన పమిడిముక్కల, నేటి పత్రిక ప్రజావార్త :కపిలేశ్వరపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టిన కామినేని హాస్పిటల్స్ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. శనివారం పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణం, నూతన భవన నిర్మాణం, స్థలం మెరక అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ డీకే …
Read More »గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్
-మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో బడ్జెట్ అవుట్ రీచ్ ఈవెంట్ – 2026-27 -నియోజకవర్గాల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ -ఈ నెల 11న జరిగే ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :గుంటూరు జిల్లాను సర్వతోముఖాభివృద్ధి పథంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని …
Read More »జనవాణి కార్యక్రమానికి 52 వినతులు స్వీకరణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ శనివారం తిరుపతిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 52 వినతులను స్వీకరించారు.ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన వినతులు అందాయి. వాటిలో కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగానికి 11, రెవెన్యూ శాఖకు 13, …
Read More »రాజధానిపై జగన్ ది గంటకో మాట
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఆ 11 సీట్లు కూడా రావు జగన్ కు మంచి వైద్యమందించాలని వైసీపీ శ్రేణులే గొణుక్కుంటున్నాయి : మంత్రి సవిత పెనుకొండలో రూ.40 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ పూల మార్కెట్ ప్రారంభించిన మంత్రి సవిత . పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : ‘దేశం మొత్తం ఏపీ రాజధాని అమరావతి అని అంటుంటే… జగన్ మాత్రం గంటకో మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి అమరావతే రాజధాని అంటారు.. మరోసారి మూడు రాజధానులంటారు… …
Read More »అన్న క్యాంటీన్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విఎంసి స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఉదయం గాంధీజీ మహిళా కళాశాల వద్దగల అన్న క్యాంటీన్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.టోకెన్ కౌంటర్‌లో ఐదు రూపాయలు చెల్లించి క్యూలో నుంచొని, అక్కడ భోజనానికి వచ్చిన ప్రజలతో వారి సమస్యలను అన్నా క్యాంటీన్ పై వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ తాము కూడా ఆహార నాణ్యత పరీక్షించేందుకు భోజనం చేశారు. అన్న క్యాంటీన్లో వసతులు ఎలా ఉన్నాయి? వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. …
Read More »పాత దుస్తులతో బ్యాగులు… పర్యావరణానికి మేలు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు విద్యార్థుల సృజనాత్మక ప్రత్యామ్నాయం రీయూజ్, రిడ్యూస్‌పై అవగాహన పెంపు విద్యార్థుల్లో సృజనాత్మకతకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం ఉదయం వన్ టౌన్ లో గల మహాత్మా గాంధీ పాఠశాలలో వినియోగించిన పాత దుస్తులతో బ్యాగుల తయారీ పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పాత దుస్తులను తమ చేతులతో బ్యాగ్ కుట్టి తీసుకువచ్చిన వారితో మాట్లాడారు. …
Read More »
Prajavartha Online Telugu News