తిరుపతి, నేటి పత్రిక విజయవాడ :
భారతీయ సాంప్రదాయ కళలకు ప్రాధాన్యతనిస్తూ “భారతకళాక్షేత్రం” ఆధ్వర్యంలో నిర్వహించిన “నృత్య, నాట్య హేళ” సాంస్కృతిక కార్యక్రమం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ నృత్య కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఈ కళల ద్వారా మన భారతీయత ప్రపంచవ్యాప్తంగా వెలుగొందుతుందని పేర్కొన్నారు. యువత సాంప్రదాయ కళలపై ఆసక్తి పెంచుకుని వాటిని ఆచరించడం ద్వారా భారతీయ సంస్కృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. కళాకారులు తమ ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం అభినందనీయమని అన్నారు.
మూడు రోజులపాటు సాగిన ఈ కార్యక్రమంలో భారతీయ వివిధ నృత్యరూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు డా. హరిప్రసాద్ అభినందనలు తెలిపారు.
అనంతరం నిర్వాహకులు దనశ్రీ, శ్రీనివాసులు, డా. హరిప్రసాద్ చేతుల మీదుగా కళాకారులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కళాకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Prajavartha Online Telugu News