Breaking News

తిరుపతిలో బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ మాజీ ఉపప్రధాని, మహానేత బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా తిరుపతి నగరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కార్యక్రమంలో పాల్గొని బాబూ జగ్జీవన్ రామ్ కి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. భారత దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర ఎంతో విశిష్టమైందని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
అలాగే యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని, సమాన హక్కులు, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బాబూ జగ్జీవన్ రామ్ సేవలు, త్యాగాలు దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని, ఆయన చూపిన మార్గం మనందరికీ దిక్సూచి అని హరిప్రసాద్ అన్నారు.
అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర కి డా. పసుపులేటి హరిప్రసాద్ శాలువా కప్పి సన్మానించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, జనసేన పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని బాబూ జగ్జీవన్ రామ్ కి ఘనంగా నివాళులు అర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *