Breaking News

Monthly Archives: April 2026

24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. అకడమిక్ కేలండర్ ప్రకారం ఈ సెలవులను ప్రకటించింది. వేసవి సెలవుల్లో ఎండ తీవ్రత, చెరువులు, కాలువల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు జిల్లా విద్యాధికారులకు పలు సూచనలు జారీ చేసింది. విద్యా సంవత్సరం చివరి రోజులోపు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భద్రతా చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. పెద్దల పర్యవేక్షణ …

Read More »

గుంటూరులో పుట్టగొడుగుల పెంపకంపై ఒక రోజు వర్క్‌షాప్‌ను నిర్వహించనున్న ఏపీ ఛాంబర్స్ ఉమెన్స్ వింగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) సెంట్రల్ జోన్ ఉమెన్స్ వింగ్, 27 ఏప్రిల్ 2026న గుంటూరులో ‘పుట్టగొడుగుల పెంపకం’పై ఒక రోజు వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నట్లు తెలియజేయడానికి సంతోషిస్తోంది. తమ నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) కార్యక్రమంలో భాగంగా, మహిళలు మరియు యువతకు ఉపాధి, ఆదాయ మార్గాలను మెరుగుపరిచే ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడం కోసం ఏపీ ఛాంబర్స్ పలు వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. గత ఏడాది కాలంగా, రాష్ట్రవ్యాప్తంగా బేకింగ్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ …

Read More »

అభివృద్ధి మంత్రం… సుపరిపాలనే లక్ష్యంగా తమిళనాడులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం

-మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై డీఎంకే తీరును ఎండగట్టిన ముఖ్యమంత్రి -ఏపీని ఉదాహరణగా చూపుతూ ఎన్డీఏతోనే అభివృద్ధి సాధ్యమని తమిళనాడులో ఎన్నికల ప్రచారం -కర్ణాటక-తమిళనాడు వివాదాలకు చెక్ పెట్టేలా గంగా-కావేరి అనుసంధానంపై ప్రస్తావన -తమిళనాడు పునర్ వైభవం ఎన్డీఏతోనే సాధ్యమంటూ సభల్లో స్పష్టంగా చెప్పిన ఏపీ సీఎం తమిళనాడు, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడులో రెండు రోజుల పాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్‌తో పలు కీలక ప్రాంతాలను ఎన్డీఏ తరపున ప్రచారం …

Read More »

ఎన్డీఏతోనే తమిళనాడుకు పూర్వవైభవం

-కేంద్రం ప్రతిపాదించినదే మెరుగైన డీలిమిటేషన్ ఫార్ములా -మాతృభాషను గౌరవిద్దాం… ఇతర భాషలపై ద్వేషాన్ని వదిలేద్దాం -చెన్నైలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు -కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో కలిసి సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు రాష్ట్రానికి ఎన్డీఏతోనే పూర్వ వైభవం వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అభివృద్ధి కావాలన్నా.. ఉద్యోగాలు రావాలన్నా… సంక్షేమం అందాలన్నా అది ఎన్డీఏతోనే సాధ్యమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. తమిళనాడులో రెండు రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి …

Read More »

ఒక కుటుంబంలో ఒక పారిశ్రామిక వేత్త నినాదం

– ఎంఎంస్ఎంఈపై మంత్రి కొండ‌ప‌ల్లి సుదీర్ఘ స‌మీక్ష‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక కుటుంబంలో ఒక పారిశ్రామివేత్త‌ను త‌యారు చేయాల‌న్న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ల‌క్ష్యానికి అనుగుణంగా ఎంఎంస్ఎంఈ ప‌ని చేయాల‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌లోని 8వ అంత‌స్తులో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల శాఖ కార్యాల‌యంలో ఎంఎస్ఎంఈపై మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప‌నితీరుతో పాటు అమ‌లు …

Read More »

చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే

-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు -“అజేయుడు” పుస్తకాన్ని ఆవిష్కరించిన పార్థసారధి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ జర్నలిస్ట్ టీడీ ప్రసాద్ “అజేయుడు” పేరిట రచించిన పుస్తకాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆవిష్కరించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థ …

Read More »

“పరీక్షా పర్వ్ 8.0”  వల్ల విద్యార్థుల్లో సానుకూల దృక్పథం 

– విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవిఎస్ సూర్యనారాయణ రాజు పిలుపు ​అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరీక్షల సమయంలో విద్యార్థుల్లో కలిగే ఒత్తిడిని దూరం చేసి, వారిలో సానుకూల దృక్పథాన్ని నింపడమే లక్ష్యంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) నిర్వహిస్తున్న “పరీక్షా పర్వ్ 8.0” వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల …

Read More »

సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం పర్యటన

-సామాజిక సమగ్రత, ప్రజా అనుసంధానంలో సింగపూర్ మోడల్ అధ్యయనం -తొలి రోజు కార్యక్రమాలు విజయవంతం టాంపిన్స్, సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం చేస్తున్న అధ్యయన పర్యటనలో భాగంగా తొలి రోజు కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి. ప్రజల భాగస్వామ్యం, సామాజిక సమగ్రత (Citizen Engagement and Social Cohesion) అంశంపై ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రుల బృందం పాల్గొంది. ఉదయం సింగపూర్ చేరుకున్న అనంతరం యంత్రలో నిర్వహించిన అధికారిక భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండ, వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బుధవారం (22-04-26) 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 134 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎల్లుండి 51తీవ్ర, 94 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే జిల్లాలు: శ్రీకాకుళం 19, విజయనగరం 21, మన్యం 3, అల్లూరి …

Read More »

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చంద్ర పునేఠా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ బందరు రోడ్డులో గల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మంగళవారం విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) బాధ్యతలు స్వీకరించారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అనిల్ చంద్ర పునేఠా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల కాలానికి నియమితులైనట్లు …

Read More »