Breaking News

కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించే బాధ్యత ప్రతి ఒక్కరిదని విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఉదయం కలరో హాస్పిటల్, చిట్టినగర్, మరియు గాంధీ హిల్ వన్ టౌన్ లో వర్డ్ ఎర్త్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వారి బాధ్యతగా నిర్వహించాలని, ఆరోగ్యకరమైన శ్వాస పేల్చేందుకు ఆక్సిజన్ ఎంతో అవసరం అయినందున అవి మొక్కల ద్వారా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. తాజాగా కార్పొరేషన్ ప్రజలకు ఉచితంగా పూల పండ్ల మొక్కలను పంపిణీ చేసి పర్యావరణం కోసం ప్రజల్లో మొక్కల పట్ల బాధ్యత కల్పించేందుకు అటువంటి కార్యక్రమాన్ని తెలిపారు. మరోవైపు నగరంలో డివైడర్ల పైన, రోడ్లకు ఇరువైపులా, పార్కుల్లో, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలలో వర్టికల్ గార్డెన్స్ వంటి కార్యక్రమాలు చేపట్టి కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. నగరపాలక సంస్థతో కలిసి వన్ ఎర్త్ వన్ లైఫ్ వారు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని, మొక్కలు మన జీవానికి ప్రాణాధారం అని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దాన్ని సంరక్షిస్తే పచ్చదనం పెరిగి ఆరోగ్యకరమైన నగరం, సుస్థిరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని అని తెలిపారు. ఒన్ ఎర్త్ – ఒన్ లైఫ్ ఫౌండర్ & అడ్మిన్ లీలా కుమారి ఏలూరి మాట్లాడుతూ, తల్లి తన శిశువును తొమ్మిది నెలలు మోస్తే, ఈ భూమి సమస్త జీవజాతిని జీవితాంతం మోస్తోంది. అందుకే ఈ పవిత్ర భూమిని కాపాడుకుందాం, పరిరక్షిద్దాం, భావితరాలకు అందంగా అందించుదాం అని పిలుపునిచ్చారు.

చిట్టినగర్‌లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. ర్యాలీ అనంతరం విద్యార్థులకు బ్యాన్ ప్లాస్టిక్’ పై అవగాహన కల్పించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎకో ఫ్రెండ్లీ కాటన్ సంస్థకు చెందిన కృష్ణ ప్రసాద్ గారు, మద్దిరాల కమలాకరరావు, హారతి, వసంత, జగదీష్, తూనుగుంట్ల శేఖర్, వెంకటేష్ మరియు గాంధీ హిల్ ఫౌండేషన్ మేనేజర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి

-కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు -బీరగానిపల్లె రిజర్వాయర్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *