Breaking News

Monthly Archives: April 2026

2026 – 27లో రాష్ట్రంలో 5 ల‌క్ష‌ల మంది మ‌హిళా పారిశ్రామికవేత్త‌లను త‌యారు చేయ‌డ‌మే ల‌క్ష్యం

– ఎస్.హెచ్.జి (SHG) సభ్యులందరికీ బీమా భరోసా – సెర్ప్ కీలక నిర్ణయాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2026 – 27 ఆర్థిక సంవ‌త్స‌రంలో రాష్ట్రంలో 5 ల‌క్ష‌ల మంది మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల‌ను త‌యారు చేయాల‌న్న గౌర‌వ ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారి ల‌క్ష్యానికి అనుగుణంగా అధికారులు ప‌ని చేయాల‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లోని …

Read More »

బాలల హక్కుల పరిరక్షణలో కమిషన్‌కు పూర్తిస్థాయి సహకారం అందిస్తాం 

– మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాలల హక్కుల పరిరక్షణలో కమిషన్‌కు  పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్, సభ్యులు మంత్రిని బుధవారం అమరావతి సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు సభ్యులు పి నాగ మానస, కేజీ పద్మలత, మందాల గంగ సూర్యనారాయణ, చల్ల మధుసూదనరావులను మంత్రికి …

Read More »

సింగపూర్ రెండో రోజు ఏపీ మంత్రుల బృందం పర్యటన

-దేశ ప్రాధాన్యతతో పాలన, సింగపూర్ మోడల్‌పై మంత్రుల అధ్యయనం -సమగ్ర పాలన, పట్టణ ప్రణాళికపై సింగపూర్‌లో రెండో రోజు మంత్రుల పర్యటన విజయవంతం సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల అధ్యయన పర్యటనలో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు సుసంపన్నంగా కొనసాగాయి. “Nation-First Governance & Political Philosophy – Political Accountability & Sustained Public Trust” అనే ప్రధాన అంశంపై మంత్రుల బృందం వివిధ సమావేశాల్లో పాల్గొని సింగపూర్ పరిపాలనా విధానాలను అధ్యయనం చేసింది. ఉదయం …

Read More »

నిరంతరాయ, నాణ్య‌మైన విద్యుత్ సరఫరాతోనే పారిశ్రామిక అభివృద్ధి

-పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది -దేశంలోనే తొలిసారి ట్రూ డౌన్ చేశాం, ఇక ట్రూ అప్ అనే మాటే ఉండదు -విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించిన తరువాతే సాధారణ ఎన్నికలకు వెళ్తాం -శ్రీసిటీ పారిశ్రామిక‌వేత్త‌ల‌తో ఇష్టాగోష్టిలో మంత్రి గొట్టిపాటి -రాచెర్ల‌, తూకివాకంల‌లో స‌బ్ స్టేష‌న్ల ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి -రాయ‌ల‌సీమ జిల్లాల్లో త్వ‌ర‌లో రూ.250 కోట్ల‌తో 65 స‌బ్ స్టేష‌న్లు -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స‌త్య‌వేడు/శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్య‌మైన, నిరంతరాయ విద్యుత్ స‌ర‌ఫ‌రా తోనే పారిశ్రామికాభివృద్ధి సాధ్య‌మ‌ని …

Read More »

నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలను ఆకస్మికంగా తనిఖీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థినులపై ఫ్యాకల్టీ లైంగిక వేధింపులపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ బుధవారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైంగిక వేధింపుల ఆరోపణలపై విద్యార్థినులు, ఫ్యాకల్టీ సభ్యులతో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చైర్‌పర్సన్ మాట్లాడుతూ—ఒక విద్యార్థిని కమిషన్ కార్యాలయానికి లేఖ రాస్తూ, కళాశాలలో …

Read More »

గంజాయి.డ్రగ్స్ వాడకాన్ని ఉక్కుపాదంతో అణచివేయండి : సిఎస్ సాయి ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి చేటు చేకూర్చే గంజాయి,డ్రగ్స్ వాడకాన్ని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోను ఉక్కు పాదంతో అణచి వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఆదేశించారు.బుధవారం సచివాలయంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్(NCORD)2026 ఏడాదికి మొదటి త్రైమాసిక సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి చేటుగా పరిణమిస్తున్నగంజాయి ఇతర మత్తు పదార్ధాల సేవనాన్ని పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం ఉందని ఆదిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈగల్ చీఫ్ రవి కృష్ణను ఆదేశించారు.గంజాయి,డ్రగ్స్ ఒక శాఖో రెండు శాఖలకో …

Read More »

మహిళల భద్రతపై రాజీ లేదు – నేరస్తులకు కఠిన హెచ్చరిక

-‘మెగా కౌన్సెలింగ్ – పరివర్తన సదస్సు’తో నిందితుల్లో మార్పు దిశగా అడుగు -జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని, సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. మహిళలకు భద్రమైన, సురక్షితమైన సమాజ నిర్మాణం అందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా …

Read More »

మదనపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఆరంభం!..

-పట్టణ ప్రజల కల సాకారం!!.. -నాణ్యమైన విద్యకు నూతన ద్వారం!.. -త్వరలో ఐదు ఎకరాల్లో శాశ్వత భవనాలకు శ్రీకారం -జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : మదనపల్లి పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం కావడం గర్వకారణమని, దీని ద్వారా పట్టణ వాసుల ఎన్నో సంవత్సరాల కల నెరవేరిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ స్థాయి విద్యాసంస్థ మదనపల్లిలో ఏర్పాటు కావడం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందన్నారు. బుధవారం మదనపల్లి పట్టణంలోని వలసపల్లిలో తాత్కాలికంగా ఏర్పాటు …

Read More »

విద్యార్థుల హాస్టళ్లకు త్వ‌ర‌లో 2.55 ల‌క్ష‌ల దోమ తెర‌లు

-28 జిల్లాలకు కలిపి రూ. 19.25 కోట్లు వ్యయం -ఇప్ప‌టికే అల్లూరి సీతారామ‌రాజు, పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాల్లో పంపిణీ పూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మ‌లేరియా జ్వ‌రాల నివార‌ణ‌కు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా దోమ తెర‌ల( లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడల్ నెట్స్ -LLINs) పంపిణీని వైద్య‌, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. రూ. 19.25 కోట్ల ఖ‌ర్చుతో రాష్ట్రంలో 7.80 ల‌క్ష‌ల మందికి (1.95 ల‌క్ష‌ల కుటుంబాలు) ఉచితంగా 6,89,421 దోమ తెర‌ల్ని పంపిణీ చేయాల‌ని వైద్యారోగ్య శాఖ‌ ల‌క్ష్యంగా పెట్టుకుంది. …

Read More »

వడగాలులు ప్రభావం చూపే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం (23-04-26) రాష్ట్రంలో 95 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 101 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎల్లుండి 50 తీవ్ర, 52 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం కడపలో గరిష్ఠంగా 44.4°C నమోదైందని అలాగే 202 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు పేర్కొన్నారు. ప్రజలు తప్పనిసరిగా ఎండ తీవ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని …

Read More »