Breaking News

Daily Archives: July 22, 2026

హజ్-2027 యాత్ర దరఖాస్తుకు రేపు ఆఖరి రోజు

-ఏపీ నుంచి దరఖాస్తు చేసుకున్న 2421మంది హాజీలు -388 మంది”షార్ట్” ఆప్షన్ ఎంపిక -విజయవాడ ఎంబార్కేషన్ ఎంచుకున్న 517 మంది యాత్రికులు -రూ.లక్ష ఆర్థిక సాయంతో “విజయవాడ” కు పెరిగిన సంఖ్య -గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ విజ్ఞప్తి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర మక్కా యాత్ర హజ్ -2027 కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు రేపటితో ముగియనున్నది. కేంద్ర హజ్ కమిటీ పెంచిన నాలుగు రోజుల గడువు శుక్రవారం(24 వ తేది )అర్ధరాత్రికి ముగుస్తుండడంతో హజ్ …

Read More »

వేగం పుంజుకున్న పల్నాడు–ప్రకాశం ‘జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార’ మెగా తాగు నీటి పథకాల పనులు

-40 శాతానికి పైగా పూర్తయిన ఇన్ టేక్ వెల్స్ – 200 కి.మీ. పైప్‌లైన్ నిర్మాణం పూర్తి -పనుల్లో మరింత వేగం పెంచాలి -⁠ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి… తాగు నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం -పనుల నాణ్యతను క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలిస్తానన్న పవన్ కళ్యాణ్ -నిర్ణీత గడువులోపు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో పని చేయాలని సూచన -జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆర్.డబ్య్లూ.ఎస్. …

Read More »

రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం -బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధుల మంజూరు -కార్పొరేట్ విద్యా సంస్థల సీట్ల కంటే ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ -ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10 కొత్త గురుకులాల ఏర్పాటు చేశాం -6 బీసీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ -వైసీపీ నాయకులు వాళ్లింటి ముందు రోడ్లు కూడా వేసుకోలేకపోయారు -వాళ్లా మమ్మల్ని విమర్శించేది..? -ససన్నకోట బీసీ గురుకుల జూనియర్ కళాశాల …

Read More »

తల్లికి వందనంతో ప్రతి ఇంటా విద్యా వెలుగు… : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

-సూపర్ సిక్స్ హామీలను దిగ్విజయంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేయడం ప్రారంభించడం పట్ల రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సీఎం నారా …

Read More »

రైళ్లలో జనరల్ కోచ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను అంగీకరించిన కేంద్రం

-జనరల్ కోచ్‌ల పెంపుపై ఎంపీ గురుమూర్తి ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా జనరల్ తరగతి కోచ్‌లకు పెరుగుతున్న డిమాండ్, ప్రయాణికుల రద్దీ, జనరల్ కోచ్‌ల ఏర్పాటు, సామాన్య ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యాల అందుబాటుపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత మూడు సంవత్సరాలుగా రిజర్వేషన్ లేని సాధారణ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆయన అంగీకరించారు. పండుగలు, …

Read More »

అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మోడీ సంతకం చేయవద్దు

-రైతు, కౌలు రైతు నేతల డిమాండ్ -​విజయవాడ ధర్నా చౌక్ వద్ద సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఉధృత ధర్నా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశీయ రైతాంగానికి నష్టం చేకూర్చే ఏ విధమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపైనా కేంద్ర ప్రభుత్వం సంతకం చేయకూడదని, కోట్లాది మంది భారతీయ రైతుల జీవితాలను అమెరికా కార్పొరేట్ మార్కెట్‌కు పణంగా పెట్టవద్దని రైతు నేతలు ఘాటుగా డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద రైతు సంఘాల సమన్వయ సమితి …

Read More »

దేశద్రోహ శక్తులకు కాంగ్రెస్‌ అండ

-ప్రధాని నివాసంపై దాడి యత్నం దేశంపైనే దాడి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ -విజయవాడ లో బిజెపి భారీ ర్యాలీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్‌ పరీక్ష అంశంపై ప్రారంభమైన ఢిల్లీ నిరసనలు దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్‌ ఆరోపించారు. నిరసన ర్యాలీ లో మాధవ్ మీడియా తో మాట్లాడుతూ దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తోందని విమర్శించారు. విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల …

Read More »

తల్లికి వందనం’తో ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు భరోసా – అంగన్వాడీ, శానిటేషన్ సిబ్బందికి పథకం విస్తరణ చారిత్రాత్మకం

-ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్, రాజీవ్ నగర్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వెనుక గ్రౌండ్ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం జమ చేసిన సందర్భంగా బుధవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా  బొండా ఉమ మాట్లాడుతూ “చదువే …

Read More »

రైతులకు లబ్ధి చేకూర్చేలా ఏపీలో 116 కిసాన్ రైళ్లు నడిచాయి – కేంద్రం

-కిసాన్ రైల్ సర్క్యూట్లపై పార్లమెంట్లో ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని కీలక ప్రశ్న -రాష్ట్రంలో కొత్త కిసాన్ రైల్ సర్క్యూట్ల ఏర్పాటు రూట్ అలైన్మెంట్స్ ఆర్థిక సాధ్యతలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం -రైతులకు లబ్ధి చేకూర్చేలా కిలోమీటర్ ఆధారిత సరికొత్త ధరల విధానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన రెండు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిసాన్ రైలు సర్క్యూట్ల సంఖ్య వాటి మార్గ అమరికలు మరియు రవాణా కోసం …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు. 38వ డివిజన్, రావి చెట్టు సెంటర్ కు చెందిన బీ గిరీష్ (18) స్పోర్ట్స్ ఇంజురీ భుజానికి తీవ్ర గాయం అవడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో వైద్యం సాయం …

Read More »