Breaking News

Daily Archives: July 22, 2026

ఆగస్ట్ 15 నుండి సింగిల్ యూజ్ ప్లాసిక్ వినియోగం, విక్రయంపై సంపూర్ణ నిషేధం అమలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆగస్ట్ 15 నుండి సింగిల్ యూజ్ ప్లాసిక్ వినియోగం, విక్రయంపై సంపూర్ణ నిషేధం అమలులో ఉంటుందని, ప్రజారోగ్య రక్షణ దృష్ట్యా నగర ప్రజలు, వ్యాపార సంస్థలు నిషేధంకు సహకరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. బుధవారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఈ-ఆటోల మ్యాపింగ్, ఎఫ్ఆర్ఎస్ ద్వారా కార్మికుల హాజరు తదితర అంశాలపై నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బందికి విధులు, డివిజన్లను పునర్విభజన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, డ్రాయింగ్ బ్రాంచ్ సిబ్బందికి విధులు, డివిజన్లను పునర్విభజిస్తూ నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–1 ఎన్.విష్ణుమూర్తి పరిధిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.వెంకట రమణ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఇంజినీర్లు బి.దిలీప్ కుమార్, కె.లక్ష్మీ నాసరయ్య, ఆర్.అంకారావు, …

Read More »

బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనుల జాప్యంపై కమిషనర్ ఆగ్రహం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనుల్లో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల సమన్వయ లోపం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రానున్న వారం రోజుల్లో పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులను, ఉద్యోగ నగర్, కొరెటెపాడు పార్క్ లను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

ఎల్ నినోతో రాబోయే మూడు నెల‌లు మ‌రింత అప్ర‌మ‌త్తం

-విద్యుత్ అంత‌రాయాలు లేకుండా స‌మ‌న్వ‌యం చేసుకోండి -ఉత్ప‌త్తికి త‌గిన విధంగా బొగ్గు నిల్వలు ఉంచండి -డాలర్, ఇండెక్స్ త‌గ్గిన‌ప్పుడు విదేశీ బొగ్గు కొనుగోళ్లు -కార్య‌చ‌ర‌ణ సామ‌ర్థ్యం పెంపుకు అద‌న‌పు చ‌ర్య‌లు -ఇంధ‌నశాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్ నినో ప్ర‌భావంతో రాబోయే ఆగ‌స్ట్, సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ మూడు నెల‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో బుధ‌వారం నాడు మంత్రి గొట్టిపాటి ఇంధ‌న శాఖ అధికారుల‌తో స‌మీక్ష …

Read More »

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా వేయాలి… : బి.వి.రామ్

-ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలుగు శక్తి లేఖ -శూన్య మాసంలో ప్రారంభోత్సవ సమాజానికి, ప్రభుత్వానికి మంచిది కాదు -ఇది ప్రజా రాజధానా? కార్పొరేట్ రాజధానా? -2029లో కూటమి ప్రభుత్వం రాని పక్షంలో అమరావతి రైతులుకి ఆత్మహత్యలే -రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన పెట్టుబడులు కేవలం 6,962 కోట్లు మాత్రమే.. -తాను ప్రజల కోసం పోరాడుతున్నానని… నీచ రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదు -అమరావతి రైతులు ఆవేదనపై వచ్చే ఆదివారం ప్రత్యేక సమావేశానికి నేను రెఢీ అని, చంద్రబాబు, లోకేష్‌ సిద్ధమా ? -మాదిగాని …

Read More »

ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల ప్రతిభకు సరిహద్దులు లేవు.. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి… : ఎస్. భరణి, ఐఎఫ్‌ఎస్

-రాష్ట్ర స్థాయి పారా క్రీడల ముగింపు కార్యక్రమంలో రిలే పోటీకి జెండా ఊపి ప్రారంభించిన ఎస్. భరణి, ఐ.ఎఫ్‌.ఎస్., వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కమిషనర్ – యూత్ సర్వీసెస్. -విజేతలకు ఛాంపియన్‌షిప్ ట్రోఫీలు, స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ప్రదానం. -కృష్ణా జిల్లా ఓవరాల్ ఛాంపియన్‌గా నిలవగా, శ్రీకాకుళం ద్వితీయ స్థానం, అనంతపురం తృతీయ స్థానం సాధించాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో, పీఎం శ్రీ, సహిత విద్య …

Read More »

బీజేపీ దాడిని తీవ్రంగా ఖండించిన ఏపీసీసీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ, రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవాల్సిన పోలీసులు, వారిపై చర్యలు తీసుకోవాల్సిన బదులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో యువ …

Read More »

“ఇంటింటికీ యోగా”పై కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ రూపకల్పనకు శ్రీకారం

-365 రోజుల పాటు యోగా కార్య‌క్ర‌మాలు జ‌రిగేందుకు వీలుగా ప్ర‌తిపాద‌న‌లు -పాఠశాలల్లో వారానికి రెండు రోజులు యోగా తరగతులు నిర్వహించే యోచన -యోగా మందిరాలుగా స్వర్ణ గ్రామాలు -సంజీవ‌ని తో అనుసంధానం కూడా -మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవానికే పరిమితం చేయ‌కుండా.. ఏడాది పొడవునా ప్రజల జీవన విధానంలో భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేస్తోంది. ‘ఇంటింటికీ యోగా’ పేరుతో 365 రోజుల పాటు యోగా కార్య‌క్ర‌మాల‌ను నిర్విఘ్నంగా …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవ‌ని’ అమ‌లుకు టెండ‌ర్లు పిలిచిన ప్ర‌భుత్వం

-టెండ‌ర్ల దాఖ‌లుకు ఆఖ‌రు తేదీ ఆగ‌ష్టు 14 -డిజిట‌ల్ వైద్య సేవ‌ల రంగంలో అనుభ‌వం ఉన్న వారు అర్హులు -5 కోట్ల‌కు పైగా ఉన్న రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్య రికార్డుల‌ నిక్షిప్తం -ఏకీకృత విధానంలో వైద్య సేవ‌లు భారీగా మెరుగుప‌డ‌తాయ‌న్న మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌ల్ని అందించ‌డంలో నూత‌న అధ్యాయం సృష్టించ‌నున్న ‘సంజీవ‌ని’ ప‌థ‌కం అమ‌లుకు రాష్ట్ర ప్ర‌భుత్వం టెండ‌ర్ల‌ను ఆహ్వానించింది. సంజీవ‌ని ( ఇంటిగ్రేటెడ్ డిజిట‌ల్ కేర్ కోఆర్డినేష‌న్ అండ్ …

Read More »

మచిలీపట్నంలో ‘తల్లికి వందనం’ సంబరం

-ఒకే ఇంట్లో ఐదుగురు పిల్లలకు తల్లికి వందనంతో రూ.75 వేలు సాయం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం 27వ డివిజన్‌కు చెందిన షబానా బేగం ఐదుగురు పిల్లల చదువులకు ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ. 75,000 ఆర్థిక సాయం మంజూరుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యార్ధులను, తల్లిదండ్రులను మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. గతంలోలా కాకుండా ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. …

Read More »