Breaking News

Daily Archives: July 22, 2026

సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 46 వ డివిజన్ , లంబాడి పేట సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, వార్డెన్ డీ అంకమ రాజు తో కలిసి విద్యార్థులకు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. 80 మంది విద్యార్థులకు దుప్పట్లు, టవల్స్, నైట్ డ్రెస్ …

Read More »

ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం,ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , టీడీపీ రాష్ట్ర నాయకులు గుర్రం కొండ , మాజీ కార్పొరేటర్లు పత్తి నాగేశ్వరరావు ,పైడి మాల సుభాషిణి ,సుజనా న్యాయమిత్రా బాయన హేరంబ కుమార్, కూటమి నేతలు తమ్మిన లీల కరుణాకర్, పోతినీడి లోకేష్, దనాల శ్రీనివాసరావు, ఆకారపు …

Read More »

స్వచ్ఛతలో కర్నూలును అగ్రస్థానంలో నిలపాలి

-సమన్వయంతో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి -ప్రైవేటు సెప్టిక్ ట్యాంకులకు జీపీఎస్ అమర్చాలి -పారిశుద్ధ్య కార్మికుల అల్పాహారానికి సన్నాహాలు -స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సూచించారు. స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి జిల్లాలోని మున్సిపల్, పబ్లిక్ హెల్త్, గ్రామీణ పారిశుద్ధ్య శాఖల …

Read More »

పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ వర్కర్ల పిల్లలకు తల్లికి వందనం అమలు

-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్ కి స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ధన్యవాదాలు కర్నూలు, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు, అంగన్వాడీ వర్కర్ల పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్‌కు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లా పర్యటనలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 16,179 మంది పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఈ సంవత్సరం నుంచి తల్లికి వందనం …

Read More »

త్వరలో డంప్ యార్డ్ ఫ్రీ పట్టణంగా డోన్

-ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ని పరిశీలించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ డోన్, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా డోన్‌లో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ నిర్మాణ పనులను స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, డైరెక్టర్ రవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 70 వేల టన్నులకు పైబడి చెత్త పేరుకుపోయిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత …

Read More »

గవర్నర్ కోటా MLC గా లేదా కైకలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గా అవకాశం కల్పించండి… : కొత్త నాగేంద్రకుమార్ (నాగబాబు)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసి గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యునిగా, లేదా కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా అవకాశం కల్పించమని…తెలుగు విద్యార్థి నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరకు పార్టీకి అంకితభావంతో పనిచేశానని, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా కాపు సామాజిక వర్గ నేతగా పనిచేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందానని, ప్రస్తుత ఏలూరు జిల్లా పూర్వపు కృష్ణాజిల్లాలో ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా, …

Read More »

అగ్నిమాపక శాఖలోని అధికారికి పదోన్నతిని అడ్డుకోవడం తగదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హత కలిగిన షెడ్యూల్డ్ కులానికి చెందిన జిల్లా అగ్నిమాపక అధికారి నాయనపల్లి అవినాష్ జయసింహకు ఉద్దేశపూర్వకంగా పదోన్నతి నిరాకరిస్తున్నారని దళిత సంఘాల నాయకులు అరోపించారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో రీజినల్ ఫైర్ ఆఫీసర్ (ఆర్‌ఎఫ్‌ఓ) పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. బుధవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ఫ్రాన్సిస్‌రాజు, జై భీమ్రావు పార్టీ ఉపాధ్యక్షుడు చింతా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… అగ్నిమాపక శాఖ డైరెక్టర్ పి.వెంకటరమణపై అధికార దుర్వినియోగం, …

Read More »

దేశ రాజ్యాంగం ప్రమాదంలో ఉంది… : చింతా మోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు నియంతల్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ తీవ్ర స్థాయిలో అగ్రహాం వ్యక్తంచేశారు. బుధవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని వారు తుంగలో తొక్కుతున్నారని, దీనివల్ల దేశం ప్రమాదకర స్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో న్యాయం చేయాలని కోరుతూ నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆయన …

Read More »

పుణ్యక్షేత్రాల సందర్శనార్థం ఐఆర్సీటీసీ ప్రత్యేక రైలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ ప్రాంతీయ అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 10 రాత్రులు, 9 పగళ్లతోగల ఈ ప్యాకేజీలో రైలు ఆగస్టు 4న సికింద్రాబాద్లో బయలుదేరి విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని మీదుగా పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్, సూర్యదేవాలయం, గయ విష్ణుపాద ఆలయం, వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయం, …

Read More »

యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పైన అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పైన రైల్వే ట్రైనింగ్ అకాడమీ సత్యనారాయణపురం నందు లోకో పైలట్లకు సైబర్ నేరాల పైన అవగాహన కల్పించినట్లు జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే అవగాహన కార్యక్రమాలలో భాగంగా రైల్వే అకాడమీ నందు సైబర్ క్రైమ్ సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ రిసోర్స్ పర్సన్ గా విచ్చేసి సైబర్ నేరాలు పట్ల అప్రమత్తతో ఉండాలని, వృద్ధులను …

Read More »