-యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీకి ఎమ్మెల్యే బొండా ఉమ శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 36వ డివిజన్ గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో గురువారం TNTUC అనుబంధ యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ నగర శాఖ మరియు వెహికల్ డిపో కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు, ఈ సమావేశంలో నూతన నగర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, ఏపీ …
Read More »Daily Archives: July 23, 2026
అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితో సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ రాజధాని పరిధిలో ఉన్నందున, రాజధానికి తగ్గట్టుగా అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని, అందుకు అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరం రాజధాని పరిధిలో ఉన్నదని, గుంటూరు నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు …
Read More »అమృత్ 2.0 పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమాల విజయవంతానికి అధికారులు కృషి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 25న జరిగే గ్రీన్ గుంటూరు, అమృత్ 2.0 పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమాల విజయవంతానికి అధికారులు కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం గ్రీన్ గుంటూరు కార్యక్రమం జరిగే శిల్పారామం, అమృత్ 2.0 పైలాన్ ఆవిష్కరణ జరిగే ప్రాంతాలను కమిషనర్ పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత శిల్పారామం, సమ్మర్ పేట చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించి, అధికారులతో మాట్లాడుతూ గ్రీన్ గుంటూరులో భాగంగా 18 …
Read More »ప్రజారోగ్యమే ధ్యేయంగా ఖాళీ స్థలాల పరిశుభ్రతపై జీఎంసీ ప్రత్యేక కార్యాచరణ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య మెరుగుదలే లక్ష్యంగా గుంటూరు నగర పాలక సంస్థ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని, ఖాళీ ప్లాట్లలో పారిశుద్ధ్య లోపం వల్ల దోమలు, ఈగలు, పందులు చేరి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున, ఖాళీ స్థలాల శుభ్రతకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాల యజమానులు తమ ప్లాట్ల చుట్టూ తప్పనిసరిగా కాంపౌండ్ వాల్ …
Read More »మామిడికి కనీస మద్దతు ధర చట్టబద్ధ హామీ కల్పించాలి
-లోక్‌సభ జీరో అవర్‌లో ప్రస్తావించిన వైసీపీ ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మామిడి రైతులకు కనీస మద్దతు ధరకి చట్టబద్ధ హామీ కల్పించాలని, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ తిరుపతి పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మామిడి రైతులు ఈ …
Read More »పంచధార్ల వారసత్వ సంపదను కాపాడాలి
-కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ మద్దిల గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం జిల్లా పంచధార్లలోని వారసత్వ సంపదను కాపాడాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో మంత్రిని కలిసి పూర్తి వివరాలను అందజేశారు. ఏఎస్ఐ రక్షిత ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు ప్రాంతం, శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసి, మొత్తం …
Read More »భూమన కుటుంబ ఆస్తుల విధ్వంసం కక్షసాధింపు చర్యే : ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి కుటుంబానికి చెందిన భూములను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని చేపట్టిన చర్యలను తిరుపతి లోక్‌సభ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. భూమన కరుణాకర రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఆయన కుటుంబ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. చట్టాన్ని అమలు …
Read More »వినూత్న ఫ్రీజ్ డ్రైయింగ్ & హీట్ పంప్ టెక్నాలజీపై అవగాహన సదస్సు నిర్వహించిన ఏపీ ఛాంబర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), ఐస్ మేక్ రిఫ్రిజరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా “ఇన్నోవేటివ్ ఫ్రీజ్ డ్రైయింగ్ & హీట్ పంప్ టెక్నాలజీ”పై అవగాహన సదస్సును విజయవాడలోని ఫార్చ్యూన్ మురళి పార్క్లో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆహార ప్రాసెసింగ్, సీఫుడ్, అగ్రి-బిజినెస్, కోల్డ్ చెయిన్ మరియు అనుబంధ పరిశ్రమల నుంచి 80 మందికిపైగా ప్రతినిధులు హాజరై విశేష ఆసక్తి కనబరిచారు. ఈ సదస్సులో అధునాతన వాక్యూమ్ ఫ్రీజ్ డ్రైయింగ్ మరియు …
Read More »నిర్ధేశిత గడువు లోపుగా సీడ్‌యాక్సెస్ రోడ్డు పూర్తికావాలి…
-అధికారులకు ఏడీసీ సీఎండీ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి రవాణా వ్యవస్థను అనుసంధానం చేసే సీడ్‌యాక్సెస్‌రోడ్డు నిర్మాణాన్ని నిర్ధేశించిన గడువు లోగా పూర్తిచేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి వారు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె సీడ్‌యాక్సెస్‌రోడ్డు ఫేజ్ -3 నిర్మాణ పనులను పరిశీలించారు. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ముఖ్యమంత్రి నివాసం మీదుగా ఉండవల్లి వరకు జరుగుతున్న రహదార్ల నిర్మాణాల పురోగతిని ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. వివిధ దఫాలలో …
Read More »ఆక్వా రైతులను సంక్షోభం నుండి ఆదుకోవాలి…
-జూలై 28న విజయవాడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం -100 కౌంట్ రొయ్యలకు రూ. 300 మద్దతు ధర ప్రకటించాలి -ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తెచ్చేందుకు జూలై 28న ఉదయం 10 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య, …
Read More »
Prajavartha Online Telugu News