Breaking News

Daily Archives: July 23, 2026

జన నాయకుడి సినిమాలో చెప్పినట్లే తమిళనాడులో సీఎం విజయ్ పాలన..!

-ప్రతి రాష్ట్రానికి విజయ్ వంటి ముఖ్యమంత్రి కావాలి -సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వీరు ముగ్గురు ఈ సినిమాను తప్పకుండా చూడాలి -ఆంధ్రాలో ప్రజా ప్రభుత్వం కావాలని… -కార్పొరేట్ ప్రభుత్వం వద్దని ప్రజల కోరుకుంటున్నారు -రాష్ట్ర భవిష్యత్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో అద్భుతంగా వెలుగుతుందని జోస్యం -తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జన నాయకుడు చిత్రం అద్భుత విజయాన్ని సాధించాలని ప్రజలతో పాటు తాను …

Read More »

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై బిజెపి నాయకులు చేసిన దాడిని ధైర్యంగా ఎదుర్కొనీ ప్రతిఘటించిన యువజన కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ. నాయకులకు అభినందనలు తెలిపిన పిసిసి నగర కాంగ్రెస్..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా సభ్య సమాజం తలదించుకునేలా బిజెపి నాయకులు రౌడీలు గుండాలా ప్రవర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై రాళ్ళు, కర్రలతో చేసిన దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని బిజెపి రౌడీలను గుండాలను తరిమి కొట్టిన యువజన కాంగ్రెస్ ఎన్.ఎస్.యు.ఐ. ఇతర నాయకులకు అభినందనలు తెలియజేసిన ఎపిసిసి ఉపాధ్యక్షుడు వి.గురునాధం, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్.. నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం …

Read More »

విద్యార్థులపై లాఠీచార్జ్, రాహుల్ గాంధీ అక్రమ నిర్బంధంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేసిన ఏపీసీసీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన అమానుష లాఠీచార్జ్‌ను, అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులను అక్రమంగా నిర్బంధించిన ఘటనను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి బృందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఏపీసీసీ ఉపాధ్యక్షులు (ఇన్‌ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్) …

Read More »

బోర్ పంపు లో నీళ్లు కేవలం వాడుకకు మాత్రమే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం నగరంలోని అన్ని బోరు పంపులకు త్రాగునీరు కాదు అనే హెచ్చరిక స్టిక్కర్లను వీఎంసీ ఇంజినీరింగ్ సిబ్బంది అతికించారు. విజయవాడ నగరపాలక సంస్థ శుద్ధి చేసి సరఫరా చేసే తాగునీటికి ప్రత్యామ్నాయంగా కొంతమంది ప్రజలు బోరు నీటిని కూడా తాగేందుకు వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బోరు నీటిని తాగడానికి కాకుండా ఇతర గృహ అవసరాలకు …

Read More »

విద్యార్థుల్లో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన… “క్యాచ్ ది రైన్” కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న వీఎంసీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు “క్యాచ్ ది రైన్” అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఉదయం పటమటలోని కేబీసీ జెడ్పీ బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులకు వర్షపు నీటి సంరక్షణ (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్)పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాముఖ్యత, ఇంకుడు గుంతలను ఎలా ఏర్పాటు చేయాలి, వర్షపు నీటిని ఎలా సేకరించి భూగర్భ జలాల్లోకి చేరేలా చేయాలి, భూగర్భ జలమట్టాన్ని పెంపొందించడం వల్ల …

Read More »

నేడు (ఈ నెల 24) పండ‌గ‌లా మెగా పీటీఎం 4.0

– విద్యార్థుల స‌మ‌గ్రాభివృద్ధికి విలువైన వేదిక‌ – కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి స‌మ‌ష్టి కృషి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, సమగ్రాభివృద్ధి, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమాన్ని ఈ నెల 24న శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో …

Read More »

విజయవాడలో జూలై 24–26 వరకు బీఎన్‌ఐ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో – కాన్క్లేవ్ 4.0

-యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేదిశగా ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో నిర్వహణ -జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ చేతుల మీదుగా గోడపత్రిక ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో బీఎన్‌ఐ (BNI) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో – కాన్క్లేవ్ 4.0కు సంబంధించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్లో జూలై 24, 25, 26 తేదీలలో ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోతో పాటు కాన్క్లేవ్ 4.0ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు …

Read More »

ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల విచారణలో వేగం పెంచాలి

-ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్ దాఖలులో జాప్యం వద్దు -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులకు సంబంధించి నమోదవుతున్న కేసుల విచారణను వేగవంతం చేయడంతో పాటు ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్ దాఖలులో ఎటువంటి జాప్యం చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశం ప్రారంభంలో గత …

Read More »

ఎన్టీఆర్ జిల్లాను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు భవన యజమానులు ముందుకు రావాలి…

-ఐటీ పరిశ్రమల స్థాపనకు అనువైన భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూముల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలి -పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం రూపొందించిన పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో ప్రముఖ ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు భవన యజమానులు, పారిశ్రామికవేత్తలు, భూ యజమానులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. జిల్లాలో ఐటీ పరిశ్రమలు, ఐటీ/ఐటీఈఎస్ సంస్థలు, స్టార్టప్ …

Read More »

హెచ్ఆర్ఎంఎస్ అమలుపై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి

– వీలైనంత త్వ‌ర‌గా పోర్ట‌ల్‌లో ఉద్యోగుల న‌మోదును పూర్తిచేయండి – జిల్లా సహకార అభివృద్ధి, సమన్వయ కమిటీ స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ స‌హ‌కార సంఘాల్లో (పీఏసీఎస్‌) మాన‌వ వ‌న‌రుల నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ (హెచ్ఆర్ఎంఎస్‌) అమ‌లుపై అధికారులు ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని, పోర్ట‌ల్‌లో ఉద్యోగుల న‌మోదు ప్ర‌క్రియ‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో జిల్లా …

Read More »