Breaking News

Daily Archives: September 10, 2026

జిల్లాల ప్ర‌గ‌తితోనే వృద్ది ప‌రుగు సాధ్యం

-జిల్లా క‌లెక్ట‌ర్లు దీనిపై దృష్టి సారించాలి -ప్ర‌తి జిల్లాకు ప్ర‌త్యేక అవ‌కాశాలుంటాయి -వాటిని గుర్తించి ఆ దిశ‌గా జిల్లాను ఆదాయ మార్గాలు పెంచాలి -వృద్ధిరేటుపై ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల ప్ర‌గ‌తి చిత్ర‌మే రాష్ట్ర వృద్ధి ప‌రుగుకు ఊత‌మిస్తుంద‌ని, జిల్లా క‌లెక్ట‌ర్లు ప్ర‌తి నెలా స్థూల విలువ జోడింపులో తాము ఏ ద‌శ‌లో ఉన్నామో తెలుసుకుని ముందుకు వెళ్ల‌డానికి కృషి చేయాల‌ని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్ సూచించారు. …

Read More »

మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్-I ఉచిత శిక్షణ దరఖాస్తుకు గడువు పెంపు

-15వ తేదీ వరకు గడువు పెంచిన ప్రభుత్వం -మైనారిటీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి -మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్-2026ను అనుసరించి గ్రూప్-I పరీక్షలకు పోటీపడే మైనారిటీ అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కు దరఖాస్తు గడువును పెంచినట్లు మైనారిటీ, న్యాయశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ …

Read More »

హజ్ యాత్రికులకు వైద్య పరీక్షల కోసం ఏర్పాట్లు

-డిఎంహెచ్ఓలు,హజ్ సోసైటీల సమన్వయం తో జిల్లాల వారిగా వైద్య పరీక్షలు -శారీరక దృఢత్వ పత్రాలను గడువులోగా పొందాలి -మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర హజ్ యాత్ర-2027(1448-హెచ్)కు దరఖాస్తు చేసుకొని ఎంపికైన హాజీలకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య, శారీరక దృఢత్వ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మైనారిటీ, న్యాయశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా జారీచేసిన సర్కులర్ …

Read More »

రాష్ట్ర మంతటా డిజిటల్ కనెక్టివిటీ

-టెలికాం కనెక్టివిటీ లేని ప్రాంతం కనిపించకూడదు -టవర్ల నిర్మాణానికి స్థల సమస్య అడ్డు కారాదు -జిల్లా కలెక్టర్లు ఈ దిశగా సహకరించాలి -ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేేని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర‌మంత‌టా డిజిట‌ల్ క‌నెక్టివీ క‌ల్పించాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఆశ‌య‌మ‌ని, రాష్ట్రంలో ఏ ప్రాంతం కూడా టెలీకాం క‌నెక్టివిటీ లేద‌నే మాట ఉత్ప‌న్నం కాకుండా ఉండాల‌న్న‌దిశ‌గా ప్ర‌భుత్వం ల‌క్ష్యం పెట్టుకుంద‌ని రాష్ట్ర ఐటీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని తెలిపారు. స‌చివాల‌యంలో జ‌రుగుతున్న క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న డిజిట‌ల్ క‌నెక్టివిటీ …

Read More »

9 లక్షల ఎకరాల ప్రీ హోల్డ్ భూములకు రిజిస్ట్రేషన్ అవకాశం

-అక్రమాలు జరిగిన 4 లక్షల ఎకరాలపై విచారణ తర్వాత నిర్ణయం -దీర్ఘకాలిక భూసమస్యలకు శాశ్వత పరిష్కారం -28 లక్షల ఎకరాలు 22-ఏ జాబితా నుండి తొలగింపు -కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శతాబ్దాల కాలంగా కొనసాగుతున్న భూసమస్యలకు చరమగీతం పాడుతూ, భూయజమానులకు వారి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల …

Read More »

చిన్నారుల కోసం 21 కొత్త పోషకాహార కేంద్రాలు

-అందుబాటులోనికి రానున్న 175 పడకలు -ప్రస్తుతం 21 కేంద్రాలు.. 340 పడకలు -రాష్ట్ర వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య సేవలు మ‌రింత చేరువ కానున్నాయి. కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు (ఎన్‌ఆర్‌సీలు) ఏర్పాటు కాబోతున్నాయి. వీటి ద్వారా 175 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఎనిమిది 10 పడకల ఎన్‌ఆర్‌సీలు, ఏడు 5 పడకల ఇంటిగ్రేటెడ్‌ ఎన్‌ఆర్‌సీలు, మరో ఆరు 10 …

Read More »

జెన్ Z ఉద్యోగులను సమర్థవంతంగా నిర్వహించేందుకు నాయకత్వ విధానాల్లో మార్పు అవసరం

-మానవ వనరుల అభివృద్ది శిక్షణా కేంద్రం హెడ్ & IIM రోహ్‌తక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధీరజ్ శర్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత తరం యువత, ముఖ్యంగా జెన్ Z ఉద్యోగులు, ఉద్యోగాన్ని కేవలం ఉపాధి లేదా ఉద్యోగ భద్రతగా కాకుండా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి ఒక అవకాశంగా చూస్తున్నారని మానవ వనరుల అభివృద్ది శిక్షణా కేంద్రం హెడ్ & IIM రోహ్‌తక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధీరజ్ శర్మ పేర్కొన్నారు. జెన్ Z వర్క్‌ఫోర్స్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంస్థల నాయకత్వం …

Read More »

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

-48 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళారాదు -ఉత్తరాంధ్ర జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షసూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపరితల ఆవర్తన ప్రభావంతో, గురువారం ఉదయం 05:30 గంటల నాటికి ఉత్తర బంగాళాఖాతం,పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండి అలలు ఎగసి పడే అవకాశం ఉందని మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. రెండు రోజులు పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని …

Read More »

విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంచిన ‘ఎకో-ఫ్రెండ్లీ వినాయక’ వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు సంప్రదాయ కళల పట్ల ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో సీవీఆర్ జీఎంసీ హైస్కూల్, విజయవాడలో “మేక్ యువర్ ఓన్ ఎకో-ఫ్రెండ్లీ వినాయక” పేరుతో ప్రత్యేక క్రాఫ్ట్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సి సి ఏ పి) ఆధ్వర్యంలో కృష్ణ కమలం ప్రావీణ్య వికాసం కార్యక్రమంలో భాగంగా గురువారం ఈ కార్యక్రమం జరిగింది. పాఠశాలలోని సుమారు 100 మంది విద్యార్థులు వర్క్‌షాప్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా వినాయక …

Read More »

8వ జిల్లా కలెక్టర్ల స‌ద‌స్సు లో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సచివాలయంలో గురువారం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన 8వ జిల్లా కలెక్టర్ల స‌ద‌స్సు తొలిరోజు స‌మావేశంలో ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో 7వ కలెక్టర్ల సదస్సు నిర్ణయాల అమలుపై చర్యల నివేదికపై స‌మీక్ష జ‌రిగింది. అదేవిధంగా ప్ర‌జ‌లు మెచ్చే సుప‌రిపాల‌న‌, నాయకత్వంలో కొత్త ఆలోచన.. పాలనలో సరికొత్త వేగం, జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్రాధాన్య అంశాలు, తీసుకున్న నిర్ణ‌యాలు, వాటి అమ‌లు, ప‌నితీరులో పోటీత‌త్వం, అవ‌కాశాలు, వ‌న‌రుల స‌ద్వినియోగం, …

Read More »