Breaking News

Daily Archives: September 10, 2026

గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమన్వయ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వినాయక చవితి, గణేష్ నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ జనరల్ ఏ. రవీంద్రరావు గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, తదితర అంశాలపై చర్చించారు. ఉత్సవ …

Read More »

రిలయన్స్ స్మార్ట్‌లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై తనిఖీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గురువారం ఉదయం మొగల్రాజపురంలోని రిలయన్స్ స్మార్ట్‌ను రీజినల్ ఫైర్ ఆఫీసర్ తన సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రీజినల్ ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ, రిలయన్స్ స్మార్ట్ యాజమాన్యం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో NOC జారీ చేయడానికి ఆస్కారం లేదని తెలిపారు. తనిఖీల్లో అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని …

Read More »

పురపాలక ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్ సమీక్ష

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న పురపాలక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ, అందిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, వాటిపై తీసుకున్న చర్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. డీలిమిటేషన్ ప్రక్రియకు …

Read More »

ప్రజారోగ్య పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ పారిశుద్ధ్యం, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, దోమల నివారణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌కు సమీపంలోని సమావేశ మందిరంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ ఆధ్వర్యంలో ప్రజారోగ్య విభాగం సిబ్బందితో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

ప్రతి వినాయక మండపం వద్ద ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా నగరంలోని ప్రతి వినాయక మండపం వద్ద భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించి, నగరంలోని వినాయక మండపాల వద్ద భక్తుల భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ, విద్యుత్ భద్రత, …

Read More »

వినాయకుని నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా నగరంలో నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కమిషనర్ నగరంలోని ఎంజీ రోడ్ పోలీస్ కంట్రోల్ రూమ్, తుమ్మలపల్లి కళాక్షేత్రం రోడ్, వినాయక టెంపుల్ రోడ్, సీతమ్మవారి పాదాలు, భవానీపురం హెడ్ వాటర్ వర్క్స్, ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్, హెచ్‌బీ …

Read More »

HIV/ మాదకద్రవ్యాల నిరోధన ప్రతి ఒక్కరి బాధ్యత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో స్థానిక శ్రీ పి.ఎస్.ఎన్.ఎమ్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెంట్రప్రగడ మరియు ఎస్.ఆర్.ఆర్. మరియు వి. సి. ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వానపాముల లోని విధ్యార్ధులకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా వి.రాజామోహన్, ప్రివెన్షన్ యూనిట్, మైగ్రెన్ట్స్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు 60 రోజులపాటు, వీధినాటికలు, యల్.ఇ.డి వ్యాన్, కరవత్రాలు/గోడపత్రికలు పంపిణి, …

Read More »

అమూల్య బాల్యాన్ని మత్తులోకి జారనీయొద్దు

-విద్యార్థులతో స్నేహపూర్వక సంభాషణలు పెరగాలి -తల్లి ,తండ్రి, డాక్టర్, పోలీస్, స్నేహితుడి పాత్ర టీచర్లు పోషించాలి -సమాజం అంతా కలిసి పని చేస్తేనే డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ సాధ్యం -నశాముక్త్  విద్యాలయ రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు చల్ల మధుసూదన రావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమూల్యమైన బాల్యాన్ని మత్తులోకి జారకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిదీ అని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు చల్ల మధుసూదన రావు పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ …

Read More »

మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై సమావేశం

చిత్తూరు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుప్పం, చిత్తూరు, పలమనేరు ప్రాంతాల్లో నిర్వహించిన సన్నాహక కార్యక్రమాల్లో తిరుపతి–చిత్తూరు కోఆర్డినేటర్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీ శ్రేణులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి …

Read More »

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన డా. పసుపులేటి హరిప్రసాద్

నగరి, నేటి పత్రిక ప్రజావార్త : మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక కార్యక్రమానికి తిరుపతి–చిత్తూరు కోఆర్డినేటర్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ధర్మరాజు మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతి వార్డు, ప్రతి బూత్ …

Read More »