హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో బి.ఆర్.నాయుడును కలిసి పుష్ఫగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. టివి 5 చైర్మన్ గా ఇరు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైన బి.ఆర్ నాయుడు స్వయంకృషి, పట్టుదల, ఆధ్యాత్మిక నిబద్ధతకూ ప్రతీక అని ఎంపి కేశినేని శివనాథ్ కొనియాడారు. హిందూ ధర్మ పరిరక్షణ, భక్తుల మనోభావాలు, ఆగమ శాస్త్రాల ప్రాధాన్యత అన్ని తెలిసిన బి.ఆర్.నాయుడుకి టిటిడి చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా వుందన్నారు. అనంతరం వీరిరువురు తిరుమలతో పాటు రాష్ట్ర అభివృద్ది పై పలు అంశాలు చర్చించుకున్నారు.
Prajavartha Online Telugu News