Breaking News

ఖరీఫ్ 25 సీజన్ కు ఎరువుల అందుబాటుకు అంతర్గత సరఫరా యాజమాన్యం పై దృష్టి పెట్టండి…

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్
-ముఖ్యమంత్రి వారి చొరవతో రాష్ట్రానికి ప్రస్తుత రబీ సీజన్ వరకు సమృద్ధిగా ఎరువుల సరఫరా చేసిన కేంద్ర ఎరువుల శాఖ
-రాబోవు ఖరీఫ్ సీజన్ నుండి ఎరువుల బఫర్ నిల్వ లకు 2 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచటం పై హర్షం ధన్యవాదములు వ్యక్తం చేసిన వ్యవసాయ అధికారులు
-యూరియా అమ్మకం ధరల నియంత్రణకు,యూరియా తయారిదారుల నుండి రిటైల్ ఎరువుల వ్యాపారుల వరకు ఉచిత లారీ రవాణా సౌకర్యం కల్పించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం 
-ఎరువుల సరఫరా,అందుబాటు అమ్మకం ధరలను రైతుల అవగాహన అంశముగా ఐవీఆర్ఎస్ కాల్ సమాచార సేకరణలో చేర్చిన ప్రభుత్వం
-రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తికి అధిక మొత్తంలో కేంద్రం యూరియా సరఫరా చేస్తున్న దృష్ట్యా ,క్షేత్ర స్థాయి వ్యవసాయ అధికారులు ఎరువులు పక్కదారి పట్టకుండా ,ఇతర రాష్ట్రాలకు రవాణా కాకుండా ,వ్యవసాయేతర అవసరాలకు వాడకుండా క్రమం తప్పని నిరంతర నిఘా పాటించాలని ఆదేశించిన సంచాలకులు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది .19/03/2025 బుధవారం రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు రాష్ట్రములోని అన్ని జిల్లా వ్యవసాయ అధికారులు,జిల్లాల మార్క్ ఫెడ్ అధికారులు ,రైల్వే వాగన్ రేక్ పాయింట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . వచ్చే నెల ఏప్రిల్ నుండి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా ,ఎరువుల సరఫరా ప్రణాళిక , ఎరువులను అందుబాటులో ఉంచడం లో వివిధ ఉద్యోగ శ్రేణుల ముఖ్యముగా గ్రామములోని రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకుడు, మండల స్థాయి వ్యవసాయ అధికారి నుండి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఎరువుల అందుబాటులో వారి విదులు ,చేపట్టాల్సిన భాద్యతలను తెలిపారు .
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల అంశమును రైతుల అవగాహన అంశముగ ఎంచుకుని ,రాష్ట్రములోని వివిధ ప్రాంతములలోని రైతులకు వ్యక్తిగతంగా ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ ద్వారా ఎరువుల సరఫరా ,అందుబాటు ,వాటి అమ్మకం ధరలు , ఎరువులను అందించటంలో క్షేత్ర స్థాయి రైతు సేవా కేంద్రం వ్యవసాయ సిబ్బంది ,సహకార సిబ్బంది అక్రమ వసూళ్లు అంశములో సమాచార సేకరణ వున్న దృష్ట్యా ,వ్యవసాయ అధికారులు ఎరువులను అందుబాటులో ఉంచడంలో క్షేత్ర స్థాయిలో పంట పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవలసినదిగా ఆదేశించారు .ఎరువులకు ఎటువంటి కొరత రాకుండా ముందస్తు వ్యూహం ,అప్రమత్తత ,సంసిద్ధత అనే అంశములు ఎరువుల సరఫరా యాజమాన్యంలో అత్యంత అవసరమని తెలిపారు .
గత ఖరీఫ్ లో సమృద్ధిగా ఎరువులను తెప్పించిన కూడా ,కొన్ని ప్రాంతాలలో యూరియా కొరత ఏర్పడి రైతుల ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటి పరిస్థితులు తిరిగి పునరావృత్తం కాకుండా జిల్లాస్థాయి అధికారులు ఎరువుల సరఫరాలోని వివిధదశలను క్షుణ్ణంగా సూక్ష్మ పరిశీలన చేయవలసినదిగా ఆదేశించారు .ఎరువులు మొదటగా దిగుమతి అయ్యే రైల్ వాగన్ పాయింట్ దగ్గర నుండి సరఫరా అయ్యే టోకు వ్యాపారులు ,రిటైల్ వర్తకులు ,సహకార సొసైటీ లు ,రైతు సేవా కేంద్రాల వరకు సరఫరా ఏమేరకు ఎవరివరకు చేరాయి అనే కోణములో పరిశీలిస్తూ ,సరియైన సమర్ధ వంతమైన అంతర్గత ఎరువుల సరఫరా యాజమాన్యం పై పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ఎరువుల సరఫరా,ధరలు , వాటిని పూర్తి స్థాయిలో అందుబాటు లో వుంచి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన భాధ్యత అధికారులపై వున్నదని తెలిపారు .
ఎరువుల సరఫరాలో రవాణా ఖర్చులు అధికంగా వుంటున్న విశాఖ జిల్లా ,అన్నమయ్య జిల్లా మరియు సత్యసాయి జిల్లాలకు రైల్వేల ద్వారా సరఫరా చేయటానికి మూడు రైల్వే వాగన్ రేక్ పాయింట్ లను ఏర్పాటు చేయవలసినదిగా కేంద్ర మంత్రికి గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతిపాదనలు పంపారని తెలిపారు.
.ఎరువుల వినియోగంలో మన దేశము ప్రతి హెక్టారుకు 140 మెట్రిక్ టన్నులు NPK (యన్ పి కె) వినియోగం వుండగా ;
,మన రాష్ట్రం వినియోగం 255 మెట్రిక్ టన్నుల NPK వుందని , మన రాస్ట్రములో గుంటూరు జిల్లా 625 మెట్రిక్ టన్నుల NPK ను వినియోగిస్తున్నాయని తెలిపారు .ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడటం వల్ల నేలలు నిస్సారమవుతున్నాయని తెలిపారు . ఎరువుల వినియోగం పంటలకు అవసరం మేర మాత్రమే వాడే విధముగా రైతులను వ్యవసాయ సిబ్బంది చైతన్యం చెయ్యాలని కోరారు .పచ్చిరొట్ట ఎరువులు , వర్మి కంపోస్టు ,పశువుల ఎరువుతదితర అంశాలపై దృష్టి పెట్టి రసాయనిక ఎరువులు వినియోగం తగ్గించాలని కోరారు .
ఈ కార్యక్రమములో శ్రీధర్ ,అడిషనల్ డెరైక్టర్, కృపదాస్,సంయుక్త సంచాలకులు (ఎరువులు),జీవీ శ్రీనివాస్ వ్యవసాయ ఉప సంచాలకులు,,మార్క్ ఫెడ్ జి యం శ్రీనివాస్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *