-తాళ్లపూడి మండలంలో 1754 మందికి కంటి అద్దాలు…
-మరో 231 మంది వృద్ధులకి కేటరాక్ట్ ఆపరేషన్ లకు సిఫార్స్…
-తాళ్లపూడి మండలంలో నూరుశాతం లక్ష్యం పూర్తి చేశారు…
తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డా. వై ఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 3 దశల్లో కంటి పరీక్షలు నిర్వహించేందుకు నేత్ర వైద్య నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణకు ప్రణాళికలు రూపొందించారు. మండలం యూనిట్ గా 3 దశల్లో పాఠశాల విద్యార్థులకు, అవ్వ తాతా లకు కంటి చూపు పరీక్షలు నిర్వహించి నట్లు కంటి వైద్య నిపుణురాలు డా. జి.ఝాన్సీ రాణి తెలిపారు. తొలి దశలో ఆషా వర్కర్లు, ఏ ఎన్ ఎమ్ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, ప్రాధమికంగా కంటి పరీక్షలు నిర్వహించే సమాచారాన్ని అందించారని ఝాన్సీ రాణీ తెలిపారు. తాళ్లపూడి మండల పరిధిలో 665 మంది పాఠశాల విద్యార్థులను, 2538 మంది అవ్వా తాతా లను గుర్తించారు. రెండవ దశలో పాఠశాల లను నేత్ర వైద్య బృందం పర్యటించి సర్వే చేసిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, తగిన సిఫార్సు లు చెయ్యడం జరిగిందన్నారు. అదేవిధంగా 3 వ దశలో ఇంతకుముందు కంటి సమస్యలు గల గుర్తించిన అవ్వా తాతా లకు గ్రామ సచివాలయాలు కేంద్రంగా ప్రతి వంద మంది చొప్పున పరీక్షలు నిర్వహించి నట్లు ఝాన్సీరాణి తెలిపారు. తాళ్లపూడి మండల పరిధిలో నూరుశాతం కంటి చూపు ఆవశ్యకత ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి నట్లు ఆమె పేర్కొన్నారు. డా. వైఎస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో భాగంగా మండలంలో పిల్లలకంటి సమస్యలు తొలగించడానికి సమర్ధవంతంగా పూర్తి చేశారు. ఈ పథకంలో 3 ఫేజ్ లు పూర్తి చెయ్యడం జరిగింది. మొదటి ఫేస్ లో 655 పిల్లల్ని స్క్రీన్ చేసి 445 మంది పిల్లలకు కంటి కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని గుర్తించడం జరిగింది. రెండో ఫేజ్ లో వారిలో కళ్ళజోడు అవసరం ఉన్న 142 పిల్లలకు కళ్లజోళ్లు ఇవ్వటం జరిగింది .ఇంకా 62 మంది పిల్లలకు కంటి శస్త్ర చికిత్సలు కోసం సిఫార్సు కూడా చేయడం జరిగింది. మెళ్ళ కంటి సమస్య తో ఉన్న విద్యార్థులకు కాకినాడ లో శస్త్ర చికిత్స కై ఏర్పాటు చేయడం జరిగింది. 3వ దశలో అవ్వ తాత లకు కంటి పరీక్షలు/ శస్త్ర చికిత్సలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తాళ్లపూడి మండలంలో ఫేజ్ మూడు లో అవ్వ తాత కళ్ళ సమస్యలకు నిర్దేశింపబడిన ఈ ప్రోగ్రాం కి వెళ్ళాం 60 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న 2538 మందిని కంటి పరీక్షలు కోసం సర్వే చేసారు. వీరిలో 1985 మందికి కళ్ళ జోళ్ళ అవసరం ఉన్నట్లు డాక్టర్లు పరీక్షలో నిర్ధారణ చెయ్యడం జరిగింది. ఇందులో కేటరాక్ట్ ఉన్న 231 మంది వృద్ధులకు కేటరాక్ట్ శస్త్ర చికిత్సలు కోసం సిఫార్సు చెయ్యడం జరిగింది.