-పాఠశాలల ఆధునీకీకరణకు గుడివాడ నియోజకవర్గానికి రూ.14.85 కోట్ల నిధులు…
-ప్రతి పేద విద్యార్థి కార్పోరేట్ తరహాలో చదుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం…
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మనబడి నాడు – నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్థాయిలో ఆధునాతన వసతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు చూపుతో విద్యా వ్యస్థకు అత్యం ప్రాధాన్యతను కల్పించారు. విద్యకు పేదరికం అడ్డురాకుడదని ప్రతి పేద విద్యార్థి కార్పోరేట్ స్థాయిలో ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువు నేర్చుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నాడు – నేడు పథకం రాష్ట్రంలోని పాఠశాలలను కార్పోరేట్ స్థాయిలో ఆదునీకరిస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ, గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలాల్లో నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లోని పాఠశాలల్లో జరిగిన అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయి. తొలివిడతలో నాడు- నేడు ద్వారా జరిగే పాఠశాల ఆదునీకీకరణ పనులకు గుడివాడ నియోజకవర్గానికి సంబందించి రూ. 14. 85 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో 2019 నవంబర్ 14 వ తేదీన మనబడి నాడు నేడు పథకాన్ని సీఎం జగన్మోహనరెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రూ.16 వేల 700 కోట్ల వ్యయంతో మూడు దశల్లో పాఠశాలల ఆధునికీకరణ చేపట్టడం జరగనుంది. పూర్తి పారదర్శకతతో, నిబద్ధత, నాణ్యతతో పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల ఆధ్వర్యంలో ఆధునికీకరణ పనులను ప్రారంభించడం జరిగింది. మూడు సంవత్సరాలలో దశలవారీగా 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్ళ ఆధునికీకరణ పనులు జరగనున్నాయి. అదేవిధంగా 27 వేల 438 అంగన్ వాడీలకు కొత్త భవనాలు నిర్మించడం జరగుతుంది. మన బడి నాడు – నేడు పథకం ద్వారా 10 అంశాలతో కూడిన మౌలిక వసతుల కల్పనతో పాటు నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, రక్షిత సాగునీటి సరఫరా, పాఠశాలల మరమ్మతులు, ప్రతి తరగతి గదికీ ఫ్యాన్లు , ట్యూబ్ లైట్ల ఏర్పాటు, ఫర్నీచర్ , గ్రీన్ చాక్ బోర్డు , పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్, ప్రహరీగోడ, వంటగది నిర్మాణంతో పాఠశాలలు అభివృద్ది చెందుతున్నాయి. నాడు – నేడు కార్యక్రమం అమలుకు ముందు ఉన్న స్థితి, అమలు తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన అభివృద్ధిని ఫొటోలతో సహా పోల్చి చూపడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షా ఫలితాలను మెరుగుపర్చడం, బడి బయట ఉన్న విద్యార్థుల సంఖ్యను తగ్గించి బడిలో చేర్పించడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల అడ్మిషన్ల శాతం పెరిగింది. కాగా నాడు – నేడు మొదటి దశలో పనులు పూర్తయిన వెంటనే రెండవ దశ పనులను ప్రారంభిస్తారు. 2022 ఆగస్టు నెలలోమూడవ దశ పనులను ప్రారంభించనున్నారు. విద్యకు పేదరికం అడ్డుకాకుడనే లక్ష్యంతో తల్లితండ్రులకు వారి పిల్లల విద్య భారం కాకూడదనే లక్ష్యంతో అమ్మఒడి, ఫీజురియంబర్సుమెంట్, విద్యా దీవేన, వసతి దీవెన వంటి పథకాలను అర్హులైన వారందరికీ అందిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు.