విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ 19 వైరస్ విజృంభిస్తున్న ఇప్పటి పరిస్థితుల్లో అర్హులైనవారందరికీ టీకా లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు నగరంలో గుణదల పి హెచ్ సి నందు అరసవిల్లి అరవింద్ ఛారిటబుల్ ట్రస్ట్, యుఎస్ఎ ఆధారిత సంస్థ పరం టెక్నాలజీస్ ఇంక్, ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ ఎల్ సి వ్యవస్థాపకుడు / చైర్మన్. అరసవిల్లి అరవింద్ ఉచితంగా “కోవిడ్ వ్యాక్సిన్ టీకా” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 2 రోజుల నుండి ఫ్రీ కోవిడ్ వ్యాక్సిన్ టీకా లు వేయిస్తున్నారు. ఆదివారం ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా అరసవిల్లి అరవింద్ మాట్లాడుతూ అరసవిల్లి అరవింద్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గతంలో ఏపీ పోలీసుల సంక్షేమ సంఘానికి ఒక లక్ష రూపాయల విరాళం అందజేశామని, పలు ప్రాంతాలలో కోవిడ్ 19 ఫస్ట్, సెకండ్ వేవ్ లలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని థర్డ్ వేవ్ లో కూడా చేతనైనంతలో సాయం చేసే ఈ ప్రక్రియలో భాగంగా ఫ్రీ కోవిడ్ వ్యాక్సిన్ టీకా లు వేసే కార్యక్రమాన్ని శనివారం నుండి ప్రారంభించామని అన్నారు. అవసరం ఉన్నవారు ఎవరైనా మా ప్రతినిధి రూప్ చంద్ ఫోన్ నెంబర్ 91541 33668 కు సంప్రదించి నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమ అనుమతులకు సహకరించిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యుఎస్ఎ ఆధారిత సంస్థ పరం టెక్నాలజీస్ ఇంక్ లో సుమారు 200 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, సుమారు 3000 మంది ట్రైనీ లు వివిధ టెక్నాలజీస్ పనిచేస్తున్నారని అటువంటి ఎందరో భావితరాలవారికి ఉద్యోగావకాశాలు కల్పించిన సంస్థ పరం టెక్నాలజీస్ ఇంక్ ద్వారా ఈ సేవా ఈ కార్యక్రమం చేయటం అనందంగా వుందని అన్నారు.
Tags vijayawada
Check Also
కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల వరద సాయాన్ని త్వరగా అందించాలి : ఎంపి కేశినేని శివనాథ్
-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …