విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగర పరిధిలోని 64 వార్డులో స్పెషల్ ఆఫీసర్లు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు యోగాంధ్ర లో భాగంగా వార్డు సచివాలయ సిబ్బంది, ప్రజలు భాగస్వామ్యంతో తమ తమ వార్డుల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా సర్కిల్ వన్ పరిధిలోని కేఎల్ రావు పార్క్, సర్కిల్ 2 పరిధిలోని బిఆర్టిఎస్ రోడ్, సర్కిల్ 3 పరిధిలోని రివర్ ఫ్రంట్ పార్క్ నందు యోగ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల భాగస్వాముతో యోగాంతరను విజయవంతంగా నిర్వహించారు.
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న యోగాంద్ర కార్యక్రమాల్లో ప్రజలు భారీ స్థాయిన పాల్గొని యోగాను నేర్చుకోవటమే కాకుండా వారి ఇంట్లో యోగాను నేర్పుతూ వారి కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు ప్రజలు చర్యలు తీసుకుంటున్నారు. కేవలం 64 వాటిలలోనే కాకుండా వెహికల్ డిపోలో కూడా డ్రైవర్లు, సిబ్బంది ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి ఏడు గంటల వరకు యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతీ, యువకులు, ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు బిఆర్టిఎస్ రోడ్ లో నిర్వహించే యోగా కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News