Breaking News

జిల్లా లో ప్రతీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికి పిజిఆర్ఎస్ నిర్వహిస్తున్నాం.

-పిజిఆర్ఎస్ లో అందచేసిన అర్జిల పరిష్కార స్థాయికి 1100 డయల్ చేసి తెలుసుకోవచ్చు
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, పరిష్కారం కానీ వాటి విషయంలో ప్రత్యక్షంగా ఆయా వ్యక్తుల, అధికారులు లతో సమావేశం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. గురువారం జిల్లా కలెక్ట ర్ క్యాంప్ కార్యాలయంలో పిజిఆర్ఎస్ పై ప్రజా సమస్యల పరిష్కర స్థాయి పై వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీ దారులతో అధికారులతో కలెక్టర్ వ్యక్తిగతంగా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే కి సంబంధించిన రాజానగరం గురించి మూడు అర్జీలు, కోరుకొండ 1, చాగల్లు 6 అర్జీలు పరిశీలించడం జరిగిందన్నారు. పరిష్కారం అయ్యే వాటి విషయంలో ఖచ్చితత్వం జవాబుదారీతనం కలిగి ఉండాలనీ ఆదేశించారు. ఉద్దేశ్య పూర్వకంగా జాప్యం చేసే వారి విషయంలో ఉపేక్షించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాజానగరం మండలం నుంచి ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, జూపూడి మధుబాబు, ఎలగ నర్సారెడ్డి, షేక్ నజీర్ లు వారి భూములు రీసర్వే చేయాలని సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

ప్రజలకి ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009  మీ సెల్ ఫోన్ల లో నిక్షిప్తం చేసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *