Breaking News

శాతవాహన పరిరక్షణ కమిటీ ఏర్పాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాతవాహన కళాశాల మైదానం కబ్జాకు గురవడం భవనాలు కూల్చివేత వంటి విషయాలు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కళాశాలను కాపాడుకోవాలని కోరుతూ కళాశాల పూర్వ విద్యార్థులు, పూర్వ సిబ్బంది, ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కలిసి శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీగా ఏర్పడ్డారు. ఆదివారం పూర్వ విద్యార్థులు ఆక్రమిత ప్రాంతం పరిశీలించారు. ఆక్రమణదారుల పైన కూల్చివేతకు కారణమైన వారిపైన తగిన చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. అనంతరం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిటీగా ఏర్పడ్డారు. కన్వీనర్గా కళాశాల పూర్వ ప్రధాన అధ్యాపకులుగా ప్రస్తుతం దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షులుగా ఉన్న వి.సాంబిరెడ్డి, కో కన్వీనర్ పూర్వ విద్యార్థులు ఎమ్. విష్ణువర్ధన్, నవనీతం సాంబశివరావు ప్రచార కమిటీ కన్వీనర్గా మోతుకూరి అరుణ కుమార్, కమిటీ సభ్యులుగా కందిరి వెంకటేశ్వరరావు చుండూరు నరేంద్ర, వి.శ్రీనివాసరావు, వల్లూరు నాగబాబు, వేదాంతం కిరణ్, మల్లంపల్లి సురేష్ ఉన్నారు. అందరినీ కలుపుకుని త్వరలో భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నట్లు పైఅధికారులను కలుస్తామని సాంబిరెడ్డి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *