ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
గురు పౌర్ణిమ ( వ్యాస పౌర్ణిమ) సందర్భం గా ఈ రోజు ఒంగోలు నగరంలోని సంతపేట సాయిబాబా దేవాలయంలో ఘనంగా జరిగిన వేడుకల్లో BJMC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా పాల్గొన్నారు. అనంతరం సాయిబాబా నిత్య సేవికుడు బాబా మార్గంలో నడుస్తూ ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ సాయిబాబా దేవాలయ ట్రాస్ట్ ఛైర్మన్ చెంచాలరావు ని షేక్ ఖలీఫా తుల్లా బాషా సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో మహా కవి పోనూరు శ్రీనివాసరావు, కంది మురళీ నాద్, వ్యాపారవేత్త శేషయా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News