-మునగచర్ల లో చంద్రన్న సామూహిక గోకులం షెడ్డు ప్రారంభం
-ప్రారంభించిన ఎంపీ కేశినేని, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ : పాల వాడకం పెరగటంతో పాడి పరిశ్రమకి డిమాండ్ పెరిగింది. కాబట్టి పాడి పరిశ్రమ అభివృద్ది చెందాలి. ఇందుకోసం కృష్ణ మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో చంద్రన్న సామూహిక గోకులం షెడ్డు ఏర్పాటు కావటం చాలా ఆనందంగా వుంది. గుజరాత్ రాష్ట్రంలో పాడి పరిశ్రమ ఏ విధంగా అభివృద్ది చెందిందో అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ది చెందేలా కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
నందిగామ నియోజకవర్గం, మునగచెర్ల గ్రామంలో కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చంద్రన్న సామూహిక గోకులం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. చంద్రన్న సామూహిక గోకులం షేడ్డును ఎంపీ కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కలిసి ప్రారంభించారు. అనంతరం గోకులం షెడ్ లోని పశువుల కోసం ఏర్పాటు చేసిన వసతులను కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు చూపించారు. గోకులం షెడ్ లో ని పశువులకు ఎంపీ కేశినేని శివనాథ్ అపాయ్యంగా పండ్లు తినిపించారు. అలాగే కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో తయారు అయ్యే వస్తువులను ఆంజనేయులు వివరించారు.
శ్రీకృష్ణాష్టమి సందర్బంగా గోకులం షెడ్ దగ్గర ఏర్పాటు చేసిన ఉట్టి సంబరాల్లో ఎంపీ కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొని ఉట్టి కొట్టారు. అలాగే కృష్ణ మిల్క్ యూనియన్ సంస్థ ప్రకటించిన బోనస్ లను కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి రోజు గోకులం షెడ్డు ప్రారంభించటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో పాడి పరిశ్రమతో సమానంగా ఏపీలో పడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో రైతులు సామూహిక గోకుల షెడ్డును ఏర్పాటు చేసుకొని రైతుల ఆర్థికంగా నిలబడేందుకు ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు . ఈ గోకులం షెడ్డు లో కృష్ణ మిల్క్ యూనియన్ పాడి రైతులకు పశుగ్రాసం దాన తోపాటు పలు రకాల సౌకర్యాలు కల్పిస్తుందని వెల్లడించారు. డ్వాక్రా మహిళలకు తయారు చేసే ఉత్పత్తులు కూడా విజయ డైరీ ద్వారా మార్కెటింగ్ చేసి వారి కి అండగా నిలవాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ మిల్క్ యూనియన్ ఎండి కొల్లి ఈశ్వర్ బాబు, కె.డి.సి.సి సి.ఈ.వో శ్యామ్ మనోహర్, . నందిగామ మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ కోట వీరబాబు, నందిగామ మండల పార్టీ ప్రెసిడెంట్ వీరంకి వీరస్వామి, చందర్లపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ మేకల సుధాకర్ , నందిగామ అబ్జర్వర్ బచ్చుల బోస్, మునగచర్ల పాల యూనియన్ సంఘం అధ్యక్షులు కొల్లూరి నాగేశ్వరరావు లతో పాటు మిల్క్ యూనియన్ డైరెక్టర్ల, మిల్క్ యూనియన్ సభ్యులు, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News