-ముఖ్యఅతిథులుగా హాజరైన రాష్ట్రమంత్రులు టి.జి.భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని శివనాథ్,
కాంటినెంటల్ కాఫీ ఫౌండర్ చల్లా రాజేంద్ర ప్రసాద్ కు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు…నీడ్స్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఫార్మూలతో ముందుకి వెళుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పోరంకి మురళీ రిస్టార్ట్స్ లో గురువారం ఎపి ఛాంబర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఎపి ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్ లెన్సీ అవార్డ్స్ -2025 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ , ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ నేపాల్లో చిక్కుకున్న తెలుగువారినిక రాష్ట్రానికి తిరిగి వెనక్కి రప్పించే కార్యక్రమంలో బిజిగా వుండటం వల్ల రాలేకపోయారని, వచ్చే ఏడాది జరిగే అవార్డ్ ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి లోకేష్ ను తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు భారీ పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఇండస్ట్రీల స్థాపనకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతోనే ముందుకి వెళుతుందన్నారు. ఇక్కడ వున్న పారిశ్రామిక వేత్తలు రాబోయే యువ పారిశ్రామిక వేత్తలకు గైడెన్స్ తో పాటు, సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో లైఫ్ టైమ్ ఎచీఫ్ మెంట్ అవార్డ్ అందుకున్న కాంటినెంటల్ కాఫీ ఫౌండర్ చల్లా రాజేంద్ర ప్రసాద్ తో పాటు అవార్డ్ గ్రహీతలకు అభినందనలు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలు పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాయని దీంతో పరిశ్రమలు రావటం అంత ఈజీ కాదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు పారిశ్రామిక వేత్తల దగ్గరకు వెళ్లి రాష్ట్రానికి పరిశ్రమలు రావటం కోసం ఎంతోగానో కృషి చేశారన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియాగా అభివృద్ది చెందటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కారణమన్నారు. అలాగే హైదరాబాద్ లో సీఎం చంద్రబాబు ఆలోచనతో ప్రారంభమైన ఎలీప్ అనే సంస్ధ ద్వారా ఎంతో మహిళ పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారన్నారు. ఇలాంటి విజన్ వున్న నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం అదృష్టమన్నారు. యువ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి. వారితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 20247 , సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 సాధించగలమన్నారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఎఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, రిటైర్డ్ ఐఎఎస్ సత్యనారాయణ, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి , ఎపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కరరావు, జనరల్ సెక్రటరీ బి.రాజశేఖర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News