Breaking News

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టారీత్యా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు అన్నారు. సర్కిల్-3 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన కేసులు పై శుక్రవారం సర్కిల్-3 కార్యాలయం, పటమట లో ఏర్పాటుచేసిన మొబైల్ కోర్టులో విచారణ జరిపారు. న్యాయమూర్తి గోలీ లెనిన్ బాబు మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేసినా, మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన, రోడ్డుపైన పెంపుడు జంతువులు ఉంచిన, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై మొబైల్ కోర్టు చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లగించిన 5 మందిపై విచారణ జరిపి రూ. 1,050/- జరిమానా విధించారు. కార్యక్రమంలో ఏ ఎం ఓ హెచ్ 3 డాక్టర్ గోపాల్ నాయక్, శానిటరీ సూపర్వైజర్స్ రమేష్ బాబు, బాలాజీ శ్రీనివాస మూర్తి , శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *