Breaking News

కృష్ణలంక పరిధిలో రహదారి ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లకు జీబ్రా లైన్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో రహదారి ప్రమాదాలను అరికట్టడానికి మరియు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి అదేశాల మేరకు ట్రాఫిక్ డి.సి.పి.శ్రీమతి షిరీన్ బేగం ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో 5 ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాల మురళి కృష్ణ, వారి సిబ్బంది మరియు మున్సిపల్ కార్పొరేషన్ (VMC) అధికారుల సమన్వయంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సమీపం సత్యం గారి హోటల్ జంక్షన్ రాఘవయ్య పార్క్ ప్రాంతం ​అమెరికన్ హాస్పిటల్ రోడ్ మరియు ​వారధి జంక్షన్ ల వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లకు (వేగ నియంత్రకాలు) స్పష్టమైన పెయింటింగ్ జీబ్రా లైన్స్ వేయించడం జరిగింది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ…. “ప్రజా భద్రతే మా ప్రధమ ప్రాధాన్యత. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహనదారులకు స్పీడ్ బ్రేకర్లు స్పష్టంగా కనిపించక పోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, రిఫ్లెక్టివ్ పెయింటింగ్‌ను వేయించడం జరిగిందని తెలిపారు. రాత్రి వేళల్లో వాహనదారులు స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పెయింటింగ్ ద్వారా దూరం నుంచే వేగ నియంత్రకాలను గుర్తించి, వేగాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. వాహనదారులు కూడా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలి” అని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది మరియు విఎంసి సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *