Breaking News

ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పర్యవేక్షణకు వార్డ్ ప్రత్యేక అధికారుల నియామకం… : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో వార్డుల వారీగా నియమించిన ప్రత్యేక అధికారులు రెవెన్యూ, పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల పనులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేయాలని, ప్రతి వార్డులో వార్డ్ లెవల్ పర్యవేక్షణ కమిటీలను 2 రోజుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డ్ స్పెషల్ ఆఫీసర్స్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ ప్రత్యేక అధికారులు వార్డు సచివాలయాల పనితీరును పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వ సర్వేలు, ఎన్నికల పనులు, జనగణన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పారిశుద్ధ్య విభాగంలో వార్డుల శుభ్రత, స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలు, సాసా కార్యక్రమాల అమలు పర్యవేక్షించాలని ఆదేశించారు. రెవెన్యూ విభాగంలో పన్నుల వసూళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు, ఫంక్షన్ హాళ్ల అద్దెల వసూళ్లపై దృష్టి పెట్టాలని, ప్రజా ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ఉపా సెల్ పరిధిలో టిడ్కో హౌసింగ్ రుణాలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మరియు ఇతర సంక్షేమ పథకాల అమలును సమర్థవంతంగా పర్యవేక్షించాలని తెలిపారు. ఇంజినీరింగ్ విభాగం తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, టౌన్ ప్లానింగ్ విభాగం నిర్మాణ వ్యర్థాల తొలగింపు, అనధికార బ్యానర్లు మరియు ఫ్లెక్సీల తొలగింపుపై చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేక అధికారులు రోజువారీగా వార్డుల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారానికి సంబంధిత శాఖాధిపతులతో సమన్వయం చేసుకోవాలన్నారు. శాఖాధిపతులు కూడా ప్రత్యేక అధికారులు సూచించిన లోపాలపై తక్షణ చర్యలు తీసుకుని అమలు నివేదికలను కమిషనర్ కార్యాలయానికి అందించాలన్నారు. క్షేత్ర స్థాయి విధుల్లో నిర్లక్ష్యం చేసే అధికారులు, సచివాలయ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమావేశంలో అదనపు కమిషనర్ (ఇంచార్జి)జి.సాంబశివరావు, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఈఈ సుందర్రామిరెడ్డి, వార్డ్ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *