-350కు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ…..
-జిల్లా నైపుణ్యాబివృద్ధి అధికారి
-ఎస్. శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన విజయవాడలో ప్రత్యేక ఉద్యోగ మేళా (Specific Job Drive) నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సాఫరాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇండియా (Safran Electrical & Power India – French Company) మరియు ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ (Premier Energies Limited) కంపెనీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నారన్నారు.
ఈనెల20వ తేదీ (బుధవారం)
ఉదయం 09:00 గంటలకు
జిల్లా ఉపాధి కార్యాలయం (District Employment Exchange Office), ప్రభుత్వ ఐ.టి.ఐ కాలేజీ ప్రాంగణం, రమేష్ హాస్పిటల్స్ రోడ్, విజయవాడ వద్ద హాజరు కావాలని కోరారు.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET), ప్రొడక్షన్ అసోసియేట్ మరియు హెల్పర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని,
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐ.టి.ఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, B.Tech మరియు పి.జి పూర్తి చేసిన వారు అర్హులు అన్నారు.
18 సంవత్సరాల నుండి 30 ఏళ్ల లోపు యువతీ యువకులు అర్హులన్నారు.
నెలకు రూ. 14,500/- నుండి రూ. 25,000/- వరకు (అర్హతను బట్టి). వేతనం ఉంటుందని అన్నారు.
ఈఎస్‌ఐ (ESI), పి.ఎఫ్ (PF), గ్రాట్యుటీ, అటెండన్స్ బోనస్ తో పాటు ఉచిత భోజనం మరియు రవాణా సౌకర్యం కల్పించబడుతుందన్నారు.
ఎంపికైన వారు హైదరాబాద్ లో ఉద్యోగం చేయవలసి ఉంటుందన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration వెబ్‌సైట్ నందు తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 93917 52833 నంబరును సంప్రదించాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఆ ప్రకటనలో కోరారు.
Prajavartha Online Telugu News