Breaking News

పుల్లేటికట్ట డ్రైన్ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పులేటి కట్ట డ్రైన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బెత్లెహేమ్ నగర్, జియాన్ బైబిల్ రోడ్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, గుణదల, ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయి లో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పుల్లేటి కట్ట డ్రైన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని అందులో ఉన్న వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. తదుపరి జియాన్ బైబిల్ స్కూల్ వద్ద పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు డివైడర్ల వద్ద డస్ట్ లేకుండా పరిశుద్ధ నిర్వాహణ పూర్తి స్థాయిలో ఉండాలని అన్నారు. తదుపరి ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను పరిశీలించారు వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ను పరిశీలించి నగరంలోని మరుగుదొడ్లన్నీ పరిశుభ్రంగా ఉండేటట్టు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అని ముఖ్యంగా ఖాళీ స్థలాలలో వ్యర్ధాలు ఎక్కువగా ఉన్నాయని గమనించి వాటిని కూడా అధికారులు ప్రత్యేక డ్రైవ్ లో తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె. షమ్మీ, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *