అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రిగోల్డ్ సమస్యపై ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించడం జరిగింది. రెండు నెలల క్రితం అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు జరిగిన సందర్భంగా ఆనాడు ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ప్రభుత్వ ప్రతినిధులుగా కుటుంబరావు, వర్ల రామయ్య అగ్రిగోల్డ్ బాధితులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింప చేశారు. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో ఆరు మాసాల్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని, మన రాష్ట్రంలో ఉన్న 11.5 లక్షల మందితో పాటు కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు తదితర 8 రాష్ట్రాల్లో ఉన్న మొత్తం బాధితుల సమస్యకి పరిష్కారానికై ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని నియమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పటం అభినందనీయం. ఇప్పటికే 12 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో మరో వాయిదా పడకుండా యుద్ధ ప్రాతిపదికన కమిటీని నియమించి, అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి, బహిరంగ వేలానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు సత్వర నిర్ణయం తీసుకొని, వాటిని అమలు జరపాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి అభినందనలు తెలియజేస్తున్నానని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు.
Tags amaravathi
Check Also
16 నెలలు… 16కు పైగా విజయాలు…
-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …
Prajavartha Online Telugu News