విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రైమ్, హారర్ నేపథ్యంలో సాగుతూ ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులను అలరించే చిత్రం “ఊరి చివర” చిత్రమని హీరో, నిర్మాత మద్దూరి విజయ్ కుమార్ వెల్లడించారు. గురువారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్ లో “ఊరి చివర” సినిమా పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం లో చిత్ర హీరో విజయ్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లి, హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, మొత్తం మూడు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేస్తామని తెలిపారు. దేశం కోసం ఒక మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉందని తెలిపారు. కష్టపడి ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదిస్తామని తెలిపారు. డైరెక్టర్ అబ్బూరి జిమ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వై.నిరోషా కథానాయకగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో మల్లెతీగ సేవా సంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ, జయకుమార్, వెంకటేష్ వేముల. డైరెక్టర్ ప్రొడ్యూసర్, కో డైరెక్టర్ పవన్ సాయి, ఆకుల సత్యనారాయణ, మెగా మూవీ అసోసియేషన్ డైరెక్టర్ యం.ఎస్ నాయుడు, విలన్ నరేష్, శాంతి అబ్బూరి మరియు ముఖ్యఅతిథిగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గుత్తికొండ ధనుంజయరావు చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News