విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విఆర్పి క్రియేషన్స్ వారి ‘నగ్నసత్యం రెడ్ బుక్’ సినిమా షూటింగ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సారద్యంలో గురువారం విజయవాడలో క్లాప్ కొట్టి ప్రారంభించారు. “గడప దాటి రాని అమరావతి ఆడపడుచుల ఆవేదన, అసెంబ్లీ లో ఒక మహానుభావుడు కార్చిన కన్నీటి బొట్లు, ఒక మహాతల్లి కి జరిగిన అవమానం ప్రజలు మరచిపోలేని నగ్న సత్యం, ఆనాటి పబ్లిక్ లుక్… దేవుడిచ్చిన రెడ్ బుక్… తొక్కేయాలని చూస్తే నా మనవడి కాళ్ళు మొక్కెందుకు మీకు చేతులు కూడా లేకుండా చేస్తా” అని ఎన్ టి ఆర్ డైలాగ్ తో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్, నాగేశ్వరావు, భాగ్యప్రియ, ఎన్ భాను, రజని, రామ్ ప్రసాద్, బాలు, బాబు, వెన్నెల, వెంకటేశ్వరావు, ఎన్ ఎస్ నాయుడు, కృష్ణ, హృదయరాజ్, కొండిశెట్టి సురేష్, స్వామి, శ్రీనివాస్ తదితర నటులు పాల్గొన్నారు. డి ఓ పి బి.వి.ఎస్ కుమార్, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. వెంకటరమణ పసుపులేటి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News