Breaking News

“పోలియో ఆదివారం” గోడ పత్రిక ఆవిష్కరన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 28వ తేదీన “పోలియో ఆదివారం” నిర్వహించబడుతున్న సందర్భంగా, ఈరోజు జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా, గోడ పత్రికను మరియు బ్యానర్ను ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టినది మొదలు 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ, ఈ ఆదివారం,28-06-2026, తేదీన ప్రతి పిల్లవానికి “రెండు పోలియో చుక్కలు “వేస్తారని, తరువాత సోమవారం, మంగళవారం వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి, ఈ ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేని వారి అందరికీ తప్పనిసరిగా” రెండు చుక్కలు” వేస్తారని, ఈ సందర్భంగా పోలియోపై నిరంతంగా విజయం సాధించాలని, ఇందు కొరకు మన జిల్లా యందు 2,48,900, మంది పిల్లలను లక్ష్యంగా చేసుకుని,1008 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సోమవారం మంగళవారాలలో, వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు ఆశాలు, జిల్లా మొత్తం మీద 6,71,409, గృహాలను సందర్శించి, ఏ ఒక్క పిల్లవాడు మిగిలిపోకుండా చుక్కలు వేసి ఇంటింటికి మార్కింగ్ చేస్తారని, ఇదే క్రమంలో రైల్వేస్టేషన్లోనూ, బస్టాండ్ లోనూ,35 ట్రాన్సిట్ పాయింట్లను గుర్తించి కవర్ చేస్తారని ఇందు కొరకు 34 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం ఈ మూడు రోజులు నిరాకంగా జరుగుట కొరకు 4274 మంది వ్యాక్సినేటర్లను,104 మంది రూట్ సూపర్వైజర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, పట్టణ ప్రాంతాలలో 47 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహిస్తారని తెలియపరిచారు.

ఇందు కొరకు అన్ని శాఖల సమన్వయంతో, ఈ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో విజయవంతంగా జరుగుటకు జిల్లా కలెక్టర్ వారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.

ఈ కార్యక్రమమునకు, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఇందుమతి దేవి, జిల్లా ఇమేజెస్ ఆఫీసర్ డాక్టర్ ఎం శరత్ బాబు, జిల్లా మలేరియా అధికారి రాజు నాయక్, డాక్టర్ సుమన్ డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *