Breaking News

బాధిత కుటుంబానికి ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ఎన్డీఏ కార్యాలయంలో 54 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు షేక్ తారిక్ అజీజ్ , కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. పంజా సెంటర్ కు చెందిన సయ్యద్ అర్షియా ఫిర్దౌస్ తన 2 సంవత్సరాల బేబీ హృద్రోగంతో బాధపడుతుంది.. మెరుగైన వైద్యం కోసం ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 5 లక్షల 13 వేల ఎల్ ఓ సీ ను చిన్నారి తండ్రికి అందజేశారు.. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు చిన్నారి తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు దుర్బేసుల హుస్సేన్, షేక్ కరిముల్లా, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *