Breaking News

నేడు ఢిల్లీకి మంత్రి సవిత

-రెండ్రోజుల పాటు హస్తినలో పర్యటన
-ఏపీ టెక్స్ టైల్స్ ఉత్పత్తుల అమ్మకాలే లక్ష్యంగా ఢిల్లీ టూర్
-భారత్ టెక్స్ -2026లో పాల్గొననున్న మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం ఉదయం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో జరుగుతున్న భారత్ టెక్స్ -2026 కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అతిపెద్ద అంతర్జాతీయ టెక్స్‌టైల్ ప్రదర్శన భారత్ టెక్స్ -2026 మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 17వతేదీ వరకూ నాలుగు రోజుల పాటు సాగే ఈ ఈవెంట్ లో ఏపీ టెక్స్ టైల్స్ ఉత్పత్తుల అమ్మకాలే లక్ష్యంగా మంత్రి సవిత ఢిల్లీలో గురువారం, శుక్రవారం రెండ్రోజులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులతో భేటీ అయ్యి ఏపీ టెక్స్ టైల్స్ ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా భారత్ టెక్స్ లో మంత్రి సవిత ఒప్పందాలు చేసుకోనున్నారు. ఏపీ నేత కార్మికులకు, టెక్స్‌టైల్ స్టార్టప్‌లకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలను సృష్టించడానికి మంత్రి సవిత ఈ ఈవెంట్ ను వినియోగించుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్ లోని ఆధునీకరించిన లేపాక్షి షోరూమ్ ను మంత్రి సవిత ప్రారంభించనున్నారు. అనంతరం ఆమె అమరావతికి తిరుగు పయనమవుతారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *