న్యూఢిల్లీ/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోల్ఫ్ టూరిజం అభివృద్ధి, తద్వారా పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే అంశాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నోయిడా (ఢిల్లీ)లో సుప్రసిద్ధ క్రికెట్ మరియు గోల్ఫ్ క్రీడాకారుడు, పీజీటీఐ (PGTI) అధ్యక్షుడు కపిల్ దేవ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గోల్ఫ్ టూరిజం విస్తరణకు ఉన్న అవకాశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి ప్రాంతాలలో గోల్ఫ్ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను మంత్రి దుర్గేష్ .. కపిల్ దేవ్‌కు వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాల్సిందిగా కపిల్ దేవ్‌ను మంత్రి దుర్గేష్ అధికారికంగా ఆహ్వానించారు.
Prajavartha Online Telugu News