Breaking News

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు

-నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం సంతోషకరం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయనీగాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రముఖ నటులు మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం సంతోషదాయకం. నాలుగవసారి ఆయన ఉత్తమ జాతీయ నటుడిగా నిలిచి యువ నటులకు స్ఫూర్తినిచ్చారు. మమ్ముట్టికి, ఆయనతోపాటు ఈ పురస్కారానికి  కార్తీక్ ఆర్యన్ కు, ఉత్తమ నటిగా నిలిచిన యామీ గౌతమ్ కు అభినందనలు.
తెలుగు చిత్ర పరిశ్రమకు పలు పురస్కారాలు దక్కడం శుభపరిణామం. ఉత్తమ పాపులర్ చిత్రంగా కల్కి 2898 ఎ.డి., ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో కల్కి 2898 ఎ.డి., (నితిన్ జిహాని చౌదరి), ఉత్తమ బాలల చిత్రంగా 35 – చిన్న కథ కాదు, ఉత్తమ బాల నటుడిగా అరుణ్ దేవ్ పోతుల, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా సుకుమార్ (పుష్ప 2), ఉత్తమ సంభాషణల రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో పుష్ప 2 (దీపాలి నూర్, శీతల్ శర్మ) దక్కించుకున్నారు. వీరందరికీ అభినందనలు.
నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారానికి ఎంపిక కావడం సంతోషాన్నిచ్చింది. నిర్మాతగా నిహారిక చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పుతోపాటు అవార్డులు దక్కించుకొంది. చిత్ర నిర్మాణంలో నిహారికతోపాటు భాగమైన పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక, ఈ చిత్ర దర్శకుడు యదు వంశీకి అభినందనలు. ఈ చిత్రానికి మేకప్ ఆర్టిస్ట్ గా బాధ్యతలు చూసిన  పి.రవి కుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యారు. ఆయనకు అభినందనలు తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పంచాయతీరాజ్, అటవీ శాఖలపై చర్చ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం శాఖాపరమైన చర్చలు చేపట్టారు. శస్త్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *