Breaking News

ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం

-చరిత్రలో నిలిచేలా ప్రారంభోత్సవం జరగాలి
-భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం
-కొత్త ఎయిర్ పోర్టు కొత్త అవకాశాలు తీసుకొస్తుంది
-పోర్టులు, హైవేలు, పరిశ్రమలు, ఎయిర్పోర్టు, టూరిజం ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర ఇక అన్ స్టాపబుల్
-ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా ప్రతి విభాగం ఉండాలి
-భోగాపురం విమానశ్రయంపై సమీక్షలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త ఎయిర్ పోర్టు ఆ ప్రాంత స్థితిగతులను మార్చేస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్ ఖరారు అయ్యింది. 2014లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలైన భోగాపురం ఎయిర్ పోర్టు పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి…రెండేళ్ల కాలంలో పూర్తి చేసింది. సర్వాంగ సుందరంగా తయారైన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్ పోర్టు ప్రారంభ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. సమీక్షకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, సిఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఉన్నతాధికారులు, మంత్రులు సత్యకుమార్, అచ్చెన్నాయుడు, అనితతో పాటు పలువురు పాల్గొన్నారు. సమీక్షకు హాజరైన ఏవియేషన్ శాఖ అధికారులు, ఎయిర్ పోర్టు నిర్మించిన జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు భోగాపురం ఎయిర్పోర్టులో నిర్మాణ వివరాలు, వసతులు, సౌకర్యాలను వివరించారు. ఎయిర్ పోర్టు కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన 8 కీలక అనుమతులు ఇప్పటికే పొందినట్లు వివరించిన అధికారులు వివరించారు.

ఉత్తరాంధ్ర ఇక అన్ స్టాపబుల్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”ఉత్తరాంధ్ర అభివృద్దిలో భోగాపురం ఎయిర్ పోర్టు కీలకం కానుంది. సామాన్యుల జీవితాలను మార్చే విధంగా ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రలో కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. ఎకనమిక్ యాక్టివిటీ ఉరుకులు పెడుతుంది. రాకపోకలు మొదలయ్యాక ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయి. సామాన్యులు కూడా అనేక రకాలుగా లబ్ది పొందుతారు. రవాణా మాత్రమే కాకుండా…టూరిజం, పారిశ్రామికపరంగా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ఎయిర్ పోర్టు ఉపయోగపడుతుంది. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో ఈ ఎయిర్ పోర్టు కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్‌లో వచ్చిన శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టు ఆ ప్రాంతంలో ఎటువంటి మార్పులు తెచ్చిందో నేడు భోగాపురంతో ఆ ప్రాంతంలోనూ అటువంటి మార్పులే తెస్తుంది. ఎకనమిక్ యాక్టివిటీ పెరిగి అన్ని వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకశాలు కలుగుతాయి. సంపద సృష్టికి అవకాశం ఏర్పడుతుంది. సాగునీటి ప్రాజెక్టులు, హైవేలు, పోర్టులు, ఎయిర్ పోర్టులతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుంది… రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర అన్‌స్టాపబుల్” అని సీఎం చంద్రబాబు అన్నారు.

ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం సెలబ్రేట్ చేసుకోవాలి

“ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా ఎయిర్ పోర్టులో ప్రతి విభాగాన్ని తీర్చిదిద్దాలి. ప్రధాని చేతుల మీదు జరిగే ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోవాలి. గిరిజన సంస్కృతి, హస్తకళలు గుర్తు చేసేలా స్వాగత కార్యక్రమం ఉండాలి. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభాన్ని ఉత్తరాంధ్రలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిన శుభ సందర్భం. ప్రతి పౌరుడూ ఎయిర్ పోర్టును చూసి గర్వించే పరిస్థితి రావాలి. ఉత్తరాంధ్రలో దీన్ని పండుగలా చేసేలా ప్రజలను, విద్యార్థులను, యువతను భాగస్వాములను చేయాలి”అని సీఎ చంద్రబాబు ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పంచాయతీరాజ్, అటవీ శాఖలపై చర్చ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం శాఖాపరమైన చర్చలు చేపట్టారు. శస్త్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *