Breaking News

పంచాయతీరాజ్, అటవీ శాఖలపై చర్చ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం శాఖాపరమైన చర్చలు చేపట్టారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతిలో ఉన్న పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేతో శనివారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ శాఖలో నిర్దేశించిన పనుల పురోగతిపై చర్చించారు. వర్షా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు పారిశుధ్య చర్యలు చేపట్టాలని, రక్షిత మంచినీరు సరఫరాపై దృష్టి సారించాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పార్లమెంట్ చర్చల్లో ‘నేషన్ ఫస్ట్’ భావన వినిపించాలి

-రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి -పార్లమెంటు వర్షా కాల సమావేశాల నేపథ్యంలో జనసేన ఎంపీలకు పార్టీ అధ్యక్షులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *