Breaking News

రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు

-భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించనున్న సీఎం
-హోంమంత్రితో పాటు పలువురు కేంద్రమంత్రులను కలవనున్న ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభంకానుంది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని ఆహ్వానించనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు. అదే విధంగా కేంద్రమంత్రులు పియూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సీఆర్ పాటిల్‌ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 07.30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 10.00 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలిసిన అనంతరం రేపు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేస్తారు. ఢిల్లీలో కార్యక్రమాలను ముగించుకుని గురువారం ఉదయం 10.20 గంటలకు రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *